Sunday, May 4, 2025
- Advertisement -

జగన్ చంద్రబాబుపై అలాంటి మాటలు ప్రయోగించేశాడేంటి!

- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. బాబుపై జగన్ విమర్శలు చేయడం రొటీనే అయినా..

ఈ సారి జగన్ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించాడు. అనంతపురం జిల్లాలో రైతు పరామర్శయాత్రలను కంటిన్యూ చేస్తున్నజగన్ డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన సభలో బాబుపై తీవ్రమైన మాటలను ఉపయోగించాడు.

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీని ఇచ్చిన విషయాన్ని జగన్ గుర్తు చేశాడు. అయితే ఆ హామీలను సరిగా నెరవేర్చడం లేదని.. జగన్ ధ్వజమెత్తాడు. ఇప్పటి వరకూ డ్వాక్రా రుణమాఫీ అంశం గురించి అస్సలు దృష్టి పెట్టకపోవడమే బాబు మోసపూరిత తీరుకు నిదర్శనం అని జగన్ విమర్శించాడు. 

ఈ ప్రసంగ ధాటిని కొనసాగిస్తూ…”ఉద్యోగం కోసం రాష్ట్రంలోని కోటీ డెబ్బై ఐదులక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. తాను అధికారం వస్తే.. ఇంటికో ఉద్యోగం అని బాబు హామీ ఇచ్చాడు. ఈ విషయం గురించి నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తే.. ఇంటికో ఉద్యోగం ఇస్తామమని మేమెప్పుడు చెప్పాం? ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మేమెప్పుడు హామీ ఇచ్చాం..? అంటూ బాబు వ్యాఖ్యానించాడు. ఈ విధంగా నిస్సిగ్గుగా బాబు మాట్లాడాడు. ఆయనకు సిగ్గులేదు.. ఎగ్గు లేదు..” అంటూ జగన్ విరుచుకుపడ్డాడు.

మరి ఈ విధంగా చంద్రబాబుకు సిగ్గు లేదు..అని జగన్ తేల్చేయడం విశేషం. ముఖ్యమంత్రి విషయంలో ఇలాంటి తీవ్రమైన పదాలను ఉపయోగించుకొనేంత టెంపర్ కు చేరుకొన్నాడు జగన్ మోహన్ రెడ్డి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -