Sunday, May 4, 2025
- Advertisement -

సామాన్యుడిలా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న జ‌గ‌న్‌..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తిరుమ‌ల శ్రీవారిని ఈ ఉద‌యం ద‌ర్శించుకున్నారు. కాబోయే సీఎం హోదాలో కాకుండా ఒక సామాన్య భ‌క్తునిలాగానె క్యూలైన్లో నిల‌బ‌డి స్వామివారిని ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఆయ‌న‌తో పాటు పార్టీకి చెందిన ముఖ్య‌నేత‌లు ఉన్నారు.

సంప్రదాయ వస్త్రాలు, తిరునామం ధరించి తిరుమల ఆలయానికి వచ్చిన వైఎస్‌ జగన్‌కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ మార్గం ద్వారా వైఎస్‌ జగన్‌ ఏడుకొండలపై కొలువై ఉన్న కలియుగ వైకుంఠనాథుడిని దర్శించారు.

ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రులు, గవర్నర్లు నేరుగా మహాద్వారం నుంచి ప్రవేశించి శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. కానీ, జగన్ ఇంకా సీఎంగా ప్రమాణం చేయలేదు కాబట్టి వీవీఐపీ దర్శన సమయంలో ఆయన వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు.శ్రీవారి సేవలో గడిపిన వైఎస్‌ జగన్‌కు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. శాలువాతో సత్కరించి.. శ్రీవారి చిత్రాన్ని ఆయనకు అందించారు. అనంత‌రం జ‌గ‌న్ క‌డ‌ప‌క బ‌య‌ల్దేరారు.

జ‌గ‌న్ ఈరోజుషెడ్యూల్‌…

10.30 – రేణిగుంట విమానాశ్రయం నుంచీ కడపకు పయనం.
11.00 – కడప విమానాశ్రయం చేరిక.
11.30 to 11.45 – పెద్ద దర్గా సందర్శన
12.15 – కడప విమానాశ్రయం నుంచీ హెలికాప్టర్‌లో పులివెందులకు పయనం.
12.45 – పులివెందుల చేరిక.1.00 – CSI చర్చిలో ప్రార్థనలు.
1.30 – ఇడుపులపాయకు పయనం.
1.45 – ఇడుపులపాయ చేరిక.
1.45 to 2.00 – YSR ఘాట్ దగ్గర నివాళులు.
2.00 to 4.30 – లంచ్ అండ్ రిజర్వ్.
4.30 – ఇడుపులపాయ నుంచి కడపకు పయనం.
5.00 – కడప నుంచి గన్నవరం పయనం.
6.00 – గన్నవరం విమానాశ్రయం చేరిక.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -