వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో శుక్రవారం మరణించారు. దీంతో వైఎస్ఆర్‌సీపీలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత జగన్ హుటహుటిన కడపకు బయలుదేరారు. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డితో వైఎస్ జగన్‌కు మంచి బంధాలు ఉన్నాయి. అప్పట్లో రాజశేఖరరెడ్డికి ఎలా చేతోడు వాదోడుగా ఇప్పుడు జగన్‌కు కూడా అదేవిధాంగా సహాయం చేస్తున్నారు వైఎస్ వివేకానందరెడ్డి. అయితే రాజశేఖరరెడ్డి మరణంతరం చోటు చేసుకున్న పరిణమాలతో జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీ పెట్టుకున్న సంగతి తెలిసిందే.
కాని అప్పుడు మాత్రం జగన్‌తో కలిసి రాలేదు వైఎస్ వివేకానందరెడ్డి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతిలో పావుగా మారారు.పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి వదినకు వ్యతిరేకంగా వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.సొంత వదిన విజయమ్మపైనే పోటీకి దిగి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 80 వేల ఓట్లు వచ్చాయి.వైఎస్ వివేకానందరెడ్డి కాకుండా మరో అభ్యర్ధి అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ మేరకు ఓట్లు వచ్చేవికావని ఆనాడు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు.
- Advertisement -
జగన్‌తో విభేదించిన వైఎస్ వివేకానందరెడ్డి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -