కశ్మీర్‌లో ఉగ్రదాడిని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీలు చేపట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు మాజీ సీఎం జగన్. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు.
ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఈరోజు సాయంత్రం ర్యాలీలు చేప్టటనుంది. ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్నారు జగన్. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ పార్టీ శ్రేణులు క్యాండిల్‌ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లాకేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు.
టూరిస్టులే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడి చేయగా ఈ ఘటనలో 28 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ముష్కరుల కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు.