వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి చేపట్టదలచిన పాదయాత్ర మరో సారి వాయిదా పడింది. ఏపీలో ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవడమే లక్ష్యంగా పాదయాత్రను తలపెట్టిన వైకాపా అధినేత వైఎస్ జగన్ కు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. విజయవాడ ప్లీనరీలో అన్నవస్తున్నాడు పేరుతో పాదయాత్ర చేపడతానని ప్రకటించిన సంగతి తెలిసిందె. అయితె ముందునుంచి పాదయాత్రపై నీలినీడలు కమ్ముకుంటూనె ఉన్నాయి.
జగన్ పాదయాత్ర ప్రతీసారి వాయిదాపడటానికి ప్రధాన కారనం అక్రమాస్తులకేసులో ప్రతీ శుక్కవారం సీబీఐ కోర్టుకు జగన్ హాజరవ్వాల్సిందె. దీని వల్ల పాదయాత్రకు అటంకం కలుగుతుందనె వైసీపీ శ్రేణులు మొదటినుంచి ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికె రెండు సార్లు వాయిదా పడిన పాదయాత్ర ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది.
పాదయాత్రకు మినహాయింపు ఇవ్వాలని తొలుత జగన్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. సీబీఐ కోర్టులోనె తేల్చుకోవాలని సూచించింది. దీంతో మరో సారి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వలేమని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో, నవంబర్ 2 నుంచి పాదయాత్రను తలపెట్టిన జగన్ దాన్ని మరోసారి వాయిదా వేశారు.
ప్రధానంగా నవంబర్ 3 శుక్రవారం కావడం, ఆ రోజు కోర్టు విచారణకు హాజరు కావాల్సి వుండటంతో, 6వ తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. కోర్టు కేసు విచారణ కారణంగానే రెండో రోజు యాత్రను ఆపడం ఇష్టం లేని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పాదయాత్రకు ఆటంకం కలగకుండా కనీసం మూడు రోజుల పాటు ఆగకుండా పాదయాత్ర చేయాలని భావించిన జగన్, ఆరవ తేదీ నుంచి 9 వరకూ యాత్ర చేసి, ఆపై 10న కోర్టు విచారణకు రానున్నారు. ఈలోగా హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందాలని కూడా జగన్ తరఫు న్యాయవాదలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురయినా పాదయాత్ర జరగడం ఖాయమనె చెప్పాలి. మరో సారి హైకోర్టు వెల్తె ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.