తెలంగాణలో టీఆర్ఎస్‌కు ఎవరు పోటి ఇవ్వాలేకపోతున్నారు. ఒక పక్క చూస్తే టిడిపి లోని ఎమ్మెలేలు వరసగా టిఆర్‍ఎస్ లో జాయిన్ అవుతున్నారు. సో అటు టిడిపి కానీ, వైకాపా కానీ ఎవరు టిఆర్‍ఎస్ కి పోటి ఇవ్వాలేకపోతున్నారు. అయితే నిన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిపోయాడు.
అంతే కాకుండా తెలంగాణలో ఉన్న వైసీపీ కూడా టీఆర్ఎస్ లో కలిపేస్తాం అని కూడా అన్నారు. అయితే ఇదే విషయంపై జగన్ పార్టీ నాయకుల దగ్గర ప్రస్తవాన రావడంతో అందరు కలిసి ఓ నిర్ణయాన్నికి వచ్చారట. తెలంగాణలో ఉన్న వైసీపీ పార్టీని టీఆర్ఎస్ లో కలపాడానికి తమకు ఇష్టం లేదని వారు అంటున్నారు.
జగన్ ద్వారానే తెలంగాణలో పార్టీని తిరిగి మొదలు పెడుతాం అని వారు అంటున్నారు. తెలంగాణలో అసలు వైసీపీ ఉన్న పెద్ద ప్రయోజనం లేదు అని మరి కొందరు అంటున్నారు.మరి కొందరు అయితే జగన్ తెలంగాణ గురించి ఏం చేశాడు అతని పార్టి ఇక్కడ ఉన్న ఒక్కటే లేకున్న ఒకటే అంటున్నారు. ఇదే పరిస్థితి టిడిపి పార్టీకి కూడా ఉంది.
చంద్రబాబు కన్న ముందే జగన్ దుకణం మూసేసి తిరిగి మళ్ళీ అతని ద్వారానే మొదలు పెట్టనున్నాడట. మరి కొందరు అయితే జగన్ పార్టీ మళ్ళీ తెలంగాణలో మొదలు కాదు ఏదో మాట వరసకు అలా అన్నారు కానీ అది కానీ పని అంటున్నారు. మరి ఈ విషయంపై నిజ నిజాలు తెలియాలి అంటే జగనే స్వంయంగా చెప్పాలి.