Sunday, May 4, 2025
- Advertisement -

సంబరాలకు సిద్ధంగా ఉండండి…సజ్జల పిలుపు

- Advertisement -

రెండోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందని, మంగళవారం ఉదయం 11 గంటలకు పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. మీడియతో మాట్లాడిన సజ్జల..ఎల్లోమీడియా,వారి అనుకూల సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి నేటితో తెరపడుతుందన్నారు.

కౌంటింగ్‌కి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని… అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఇచ్చిన నంబర్లు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు.లోకల్‌ సర్వేలను చూస్తే ట్రెండ్‌ ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు.

ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని… కౌంటింగ్‌ సమయంలో ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు కాబట్టి మనవాళ్లు ఎక్కడ సమయమనం కోల్పోవద్దని సూచించారు.ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఏపీలో మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌పై కొత్త నిబంధన పెట్టడంలో అర్ధం ఏంటన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -