Sunday, May 4, 2025
- Advertisement -

వైసీపీ చేప‌ట్టిన‌ బంద్ పై ప్ర‌భుత్వం ఉక్కుపాదం..రోజా అరెస్ట్‌, ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే..

- Advertisement -

ధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్‌ను ప్ర‌భుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. తెల్ల‌వారు జామునుంచే పార్టీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చి నిర‌స‌న తెలుపుతున్నారు.

రోడ్డెక్కి ఆందోళన నిర్వహిస్తున్న పలువురు పార్టీ నేతలను, శ్రేణుల‌ను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో బంద్‌లో పాల్గొన్న వైసీపీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజాతోపాటు ఎమ్మెల్యే నారాయణస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తనను అరెస్ట్ చేయడంతో ప్ర‌భుత్వం మీద రోజా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హోదా కోసం బంద్ పాటిస్తున్న తమను అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచివేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని రోజా దుమ్మెత్తి పోశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -