Monday, May 5, 2025
- Advertisement -

ప్ర‌త్యేక‌హోదా కేసులో ముద్దాయిలు ఏ1 భాజాపా, ఏ2 టీడీపీ, ఏ 3 కాంగ్రెస్‌…

- Advertisement -

రాజ్య‌స‌భ‌లో ఏపీ సంబంధించిన ప్ర‌త్యేక‌హోదాపై స్వ‌ల్ప కాలిక చ‌ర్చ వాడే వేడీగా జ‌రిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని అని టీడీపీ న‌మ్మ‌డంలేద‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను తిరస్కరించడం ఆంధ్రప్రదేశ్‌కు చావు, బతుకుల మధ్య పోరాటమేనని , ప్ర‌త్యేక హోదా కోసం గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా వైసీపీ పోరాడుతోంద‌న్నారు.

ప్ర‌త్యేక‌హోదాతోనే ఏపీకీ న్యాయం జ‌రుగుతుంద‌ని న‌మ్ముతున్నామ‌ని టీడీపీ మాత్రం న‌మ్మ‌డంలేద‌ని ప్ర‌త్యేక ప్యాకేజీ వ‌ల్లే మేటు జ‌రుగుతోంద‌ని న‌మ్ముతోంద‌న్నారు. ప్రత్యేక హోదాకు ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదని వైసీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం నమ్ముతున్నాయ‌న్నారు.

తన దృష్టిలో ఏపీ ప్రత్యేక ప్యాకేజీ కేసులో మొదటి ముద్దాయి బీజేపీ, రెండవ ముద్దాయి టీడీపీ, మూడ‌వ ముద్దాయి కాంగ్రెస్ అని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాతి ప్రభుత్వాలు గౌరవించాలని కోరారు. 14వ ఆర్థిక సంఘం వంకతో బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం సబబు కాదని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -