వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆ పార్టీకి భవిష్యత్‌లో ఒక వర్గం ప్రచారాన్ని చేస్తోంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజం ఉంది..? అంటే ఏమాత్రం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. కడప, కర్నూలు, నెల్లూరు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. ఈ గెలుపు వెనక ఎన్ని కుట్రలు, ఇంకెన్ని ఎత్తులు, కలిసివచ్చిన పరిస్థితులు ఉన్నాయని ఆలోచించుకోవాలి. కర్నూలు విషయానికి వస్తే అక్కడ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో టీడీపీకి సానుభూతి కలిసివచ్చింది. ఏపీ లో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార సాధించింది.
నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి విజయం సాధించారు. 87 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిపై నారాయణ రెడ్డి గెలుపొందారు. నెల్లూరు స్థానిక సంస్థల్లో మొత్తం 851 ఓట్లు నమోదు అయితే టీడీపీ అభ్యర్ధి వాకాటి కి 462 ఓట్లు రాగ ..వైసీపీ అభ్యర్ధికి 378 ఓట్లు వచ్చాయి. కర్నూలు జిల్లా లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి..వైసీపీ అభ్యర్థి గౌరు వెంకట్ రెడ్డిపై 56 ఓట్ల తేడాతో గెలుపొందారు. అందులోను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇంచార్జీ మంత్రి అచ్చెన్నాయుడు కల్పించిన అన్ని రకాల భరోసా వల్ల కూడా అక్కడ గెలుపు సాధ్యమైంది. ఇక కడపలో జరిగిన రాజకీయాలు అయితే కథలు కథలుగా చెప్తున్నారు. సదరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గోవా, బెంగళూరు, తమిళనాడులో టూర్లు వేయించారు.
అంతేకాకుండా మరిఎన్నో ముడుపుల అప్పజెప్పారు. ఇంత చేసిన భారీ ఓట్ల తేడా తో గెలిచారంటే అదీ లేదు. 434 ఓట్లు టీడీపీకి దక్కితే 397 వైఎస్ వివేకానంద రెడ్డికి వచ్చాయి. నారా లోకేష్, ఎంపీ సీఎం రమేశ్, మంత్రి గంటా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి గెలిచి పార్టీ పిరాయించిన ఆదినారాయణ రెడ్డి నిరంతరం శ్రమిస్తే ఇది సాధ్యమైంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పాల్గొన్నది ప్రజలు కాదు. వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు అంతకంటే కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. ఈ ప్రజా ప్రతినిధుల్లో కొందరు అమ్ముడుపోయారనేది అంతటా వినిపిస్తున్న టాక్. ఈ నెపథ్యంలో ప్రజాదరణ విషయంలో ఏ మాత్రం తేడా లేదని చెప్తున్నారు. త్వరలో జరగబోయే పెండింగ్ పురపాలక సంస్థల ఎన్నికలయినా లేకపోతే సీఎం చంద్రబాబు ధైర్యం చేసి ప్రవేశపెడితే జంప్ జిలానీల నియోజకవర్గంలోని ఉప ఎన్నికలు అయిన వైసీపీకి క్షేత్రస్థాయిలో ఉన్న పట్టును రుజువు చేస్తాయని అంటున్నారు.