ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో టేపులు బయటికొచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వై.సి.పి ఈ కేసులో టిడిపి పై దాడిని తీవ్రతరం చేయలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆడియో టేపులు బయటపడిన తర్వాత వైసిపి దాడిని తీవ్రతరం చేయడానికి సన్నద్దమవుతోంది.
ఈ మేరకు వైయస్ జగన్ ఢిల్లీ వెళ్ళి ఓటుకు నోటు కేసులో చంద్రబాబును A1 ముద్దాయిగా చేర్చాలని ప్రధాని మోడి, కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు.
ఇప్పటికే గవర్నర్ నరసింహన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇప్పుడు చంద్రబాబు ఆడియో టేపులు బయటపడిన నేపథ్యంలో కేంద్రంలో దీన్ని పెద్ద వివాదంగా మలచడానికి, జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి వైసిపి సిద్దమవుతోంది. కేంద్రంలో ఆయా మంతులను, నేతలను కలిసి వినతిపత్రం ఇచ్చి ప్రచారం చేయడానికి సిద్దమయ్యారని సమాచారం.
ఇప్పటికే గవర్నర్ నరసింహన్, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ లు ఢిల్లీ పర్యటన చేయబోతుండగా వారిలో జగన్ కూడా కలవనుండటం విశేషమే.