2018 సంవత్సరానికి గుడ్‌బాయ్ చెప్పేందుకు దేశ ప్రజలు సిద్దంగా ఉన్నారు.2019 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్దమువుతున్నారు. 2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో టాప్ పొలిటికల్ సంచలనాలు చోటు చేసకున్నాయి. కొన్ని పార్టీలకు మంచి జరుగుతే కొన్ని పార్టీలకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
జగన్‌పై కత్తితో దాడి… ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్‌లో ఒ యువకుడు కత్తితో దాడి చేసిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. ఈ ఘటనపై పార్టీల మధ్య పెను దుమారమే రేగింది. ఆ ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఘటన జరిగిన ప్రదేశం రాష్ట్ర పరిధిలోనే ఉంది కాబట్టి అది రాష్ట్రానికే సంబంధమని బీజేపీ వాదించాయి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే సిట్‌పై తనకు నమ్మకం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ వేశారు. ఇది ప్రస్తుతం విచారణలో ఉంది.
టీడీపీ,బాజాపా బ్రేకప్…2014 ఎన్నికల్లో భాజాపా, టీడీపీ కలసి పోటీ చేసి టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా బాధ్యతులు స్వీకరించారు.నాలుగు సంవత్సరాలపాటు కలసి ఉన్న రెండు పార్టీలు 2018లో విడాకులు తీసుకున్నారు. ప్రత్యేక హోదాకోసం ఎన్డీఏపై అవిశ్వాస తీర్మానం పెడతామని వైసీపీ ప్రకటించిన వెంటనే ముందుగాలనే టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఎన్డీఏ నుంచి వైదొలిగింది. తర్వాత టీడీపీ, భాజాపా ఒకరిమీద ఒకరు చేస్తున్న విమర్శలు తెలిసిందే.
కాంగ్రెస్, టీడీపీ పొత్తు… కాంగ్రెస్ ,టీడీపీ పొత్తు ఈ దశాబ్దంలో హైలెట్ . రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేదానికి ఈ పొత్తే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. రాజకీయ అవసరాలకోసం పార్టీ విలువలను దిగజార్చి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు బాబు. తెలంగాణాలో ఎన్నికల్లో కూటమి చిత్తుగా ఓడిపోయింది. ఇక టీడీపీ విషయానికి వస్తే తెలంగాణాలో పార్టీ కణుమరుగయ్యిందనే చెప్పాలి.
వైసీపీ ఎంపీల రాజీనామాలు…మొదటినుంచి ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటం చేస్తోంది. ఈ అంశాన్ని టీడీపీ తుంగలోకి తొక్కి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది. వైసీపీ చేస్తున్న పోరాటం భయంతో బాబు ఎన్ని సార్లు యూటర్న్‌లు తీసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేక హోదా ఇవ్వనుందుకు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. కాని టీడీపీ ఎంపీలు మాత్రం ఇంకా కొనసాగుతున్నారు.
టీడీపీ నేతలపై సీబీఐ దాడులు…2018లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది టీడీపీ బడాబాబులపై సీబీఐ, ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ అధికారులు వరుస దాడులు నిర్వహించడం రాజకీయ దుమారాన్ని రాజేసింది. బాబు అత్యంత అప్తులయిన సీఎమ్ రమేష్, సుజనా చౌదరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన మరికొందరు టీడీపీ నేతల మీద దాడులు జరిగాయి. కేంద్రం కావాలనే దాడులు చేయిస్తోందని టీడీపీ ఆరోపించింది.
ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ…..సీబీఐ, ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ అధికారులు వరుస దాడుల నేపథ్యంలో బెంబెలెత్తిన సీఎం చంద్రబాబు సీబీఐకి నోట ఎంట్రీ బోర్డు పెట్టారు. కేంద్రం కావాలనే కక్ష గట్టిందని ఏపీలో సీబీఐకి ఇచ్చే సాధారణ అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. దీంతో పశ్చిమబెంగాల్‌లో కూడా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో సీబీఐకి అనుమతిని నిరాకరించారు.
తిత్లీతుఫాన్….2018 సంవత్సరలో తిత్లీ తుఫాన్ ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసింది.ఈ తుఫును పార్టీల మధ్య విమర్శలకు దారి తీసింది.రాష్ట్ర ప్రభుత్వం – జనసేన మధ్య పెద్ద రచ్చ జరిగింది. ప్రజల్ని ప్రభుత్వం పట్టించుకోలేదని, కేవలం పబ్లిసిటీ క్రియేట్ చేసుకుందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
చింతమనేని ప్రభాకర్ చుట్టూ వివాదాలు…టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చుట్టూ పలు వివాదాలు మూటగట్టుకున్నాయి. ఆయన వ్యవహారశైలి మీద అటు వైసీీపీ, ఇటు జనసేన కూడా మండిపడుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే అయి ఉండి అధికారులు, పోలీసుల మీద రౌడీయిజం చేస్తారని మండిపడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కళ్యాన్ కూడా చింతమనేని ప్రభాకర్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.
వైసీపీకీ ప్లస్..టీడీపీకీ మైనస్.. మడకశిర ఎమ్మెల్యే ఈరన్న మార్పు కూడా ఈ ఏడాది వార్తల్లో నిలిచిన అంశం. 2014లో టీడీపీ తరఫున గెలిచిన ఈరన్న ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈరన్న తన భార్య ఉద్యోగం విషయాన్ని దాచి ఉంచారంటూ ఆయనపై పోటీ చేసిన వైసీపీ నేత తిప్పేస్వామి కోర్టుకు వెళ్లడంతో తిప్పేస్వామికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ప్రమాణస్వీకారం చేశారు.ఈ వివాదాలే అత్యంత ఎక్కువగా ప్రజల దృష్టిని ఆకర్శించాయి.