Friday, April 19, 2024
- Advertisement -

కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇచ్చిన బాలీవుడ్ సెలబ్రిటీ….

- Advertisement -

కాంగ్రెస్‌ పార్టీకి బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ బిగ్ షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో చిల్లర రాజకీయాలతో విసిగిపోయానని… అందుకే పార్టీకి రాజీనామా చేశానని ఆమె తెలిపారు.పార్టీలో అంతర్గత రాజకీయాలు తారాస్థాయికి చేరాయని.. స్వార్థం కోసం కొందరిని వాడుకుంటున్నారని ఆరోపించారు. పార్టీలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదని ఆమె మండిపడ్డారు. అందుకే పార్టీకి రాజనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ముంబై నుంచి పోటీ చేసిన ఊర్మిళ బీజేపీ సీనియర్‌ నేత గోపాల్‌ శెట్టి చేతిలో ఓటమి పాలయ్యారు.రంగీలా, జుదాయి, మస్త్ వంటి బాలీవుడ్ సినిమాలతో పాటు పలు తెలుగు చిత్రాల్లో ఊర్మిళ నటించారు. ఎన్నికలకు ముందే ఆమె కాంగ్రెస్ లో చేరారు. నెలలు కూడా గడవక ముందే ఆమె ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -