కర్ణాటకలో మోడీ ఓడిపోవాలని పచ్చ బ్యాచ్ మొత్తం చేయని ప్రయత్నం లేదు. మోడీని ఓడించడం కోసం విభజనకు మూలకారణమైన కాంగ్రెస్‌ని గెలిపించమని పిలుపివ్వడంలోనే బాబు అసలు నైజం బయటపడింది. 2014 ఎన్నికల్లో కూడా విభజనకు కాంగ్రెస్‌తో సమానంగా కారణమైన బిజెపికి సీమాంధ్రుల చేత ఓట్లేయించారు. అదేంటంటే ప్రత్యేక హోదా, రైల్వేజోన్, రాజధాని, పోలవరం రావాలంటే బిజెపికి ఓట్లేయాలని చెప్పుకున్నారు. కానీ జరిగింది మాత్రం ఏమీ లేదు.ఇక ఇప్పుడు లోపాయికారిగా కాంగ్రెస్‌తో కుమ్మక్కయి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌కి సాయం చేయడానికి మోడీని దెబ్బకొట్టడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ ఓడిపోతాడు….ఓటమి ఖాయం…..ఎదురుగాలి అంటూ టిడిపి నేతలు, పచ్చ మీడియా అంతా కూడా మామూలుగా ప్రచారం చేయలేదు. ఇక ఆరడుగుల బుల్లెట్ అని పచ్చ బ్యాచ్ ప్రచారం చేసిన ఉద్యోగ సంఘాల నేత, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిండా ముంచిన అశోక్‌బాబుకు మహేష్ కత్తి లాంటి వాళ్ళను జత చేసి అన్ని ఖర్చులతో కర్ణాటక పంపించారు.
చివరకు బాబు అండ్ కో ప్రయత్నాలన్నీ వేస్ట్ అయ్యాయి. మోడీ కొట్టిన దెబ్బకు కర్ణాటకలో కాంగ్రెస్, జేడిఎస్‌ల కంటే పచ్చ నేతలే ఎక్కువ గింగిరాలు తిరిగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాబు అభివృద్ధి చేస్తున్న తీరు చూసి ఢిల్లీ పెద్దలు వణుకుతున్నారని టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు ఆవేశంగా ప్రకటించారు. ఎపి అభివృద్ధి చెందితే ఢిల్లీ పెద్దలు ఎందుకు వణుకుతారు అని జర్నలిస్టులు ప్రశ్నించడంతో దెబ్బకు సైలెంట్ అయ్యాడు. ఇక కౌంటింగ్ ప్రారంభంలో బిజెపి ఓటమి ఖాయం అంటూ టిడిపి నేతలు, బాబుకు అనుకూలంగా ఉండే మేధావులు పచ్చ మీడియాలో పిచ్చి పిచ్చి సిద్ధాంతాలతో విశ్లేషణలు చేశారు. తీరా బిజెపి గెలుపు ఖాయం అని తెలిశాక అందరూ మాయం. యనమల లాంటి వాళ్ళు మాత్రం బిజెపి నైతికంగా ఓడిపోయింది అని ప్రకటించారు. అదెలానో యనమలనే చెప్పాలి.
ఇక చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో కూడా టెన్షన్ టెన్షన్ వాతావరణం ఉంది. బుధవారం నాడు చంద్రబాబు వరుసగా మంత్రివర్గ భేటీ, సమన్వయ కమిటీ భేటీ….. ఇంకా టిడిపి భజన మీడియా పెద్దలు, సపోర్టర్స్‌తో వరుసగా భేటీలు జరపనున్నాడని తెలుస్తోంది. బిజెపిని ఎలా కౌంటర్ చేయాలి? బాబును ఇబ్బందిపెట్టేలా మోడీ చర్యలు ఉండే అవకాశం ఉంటే ముందుగానే ప్రజల ముందు సానుభూతి డ్రామాలు, చేతకాని కబుర్లు ఎలా చెప్పాలి అనేవి ఈ సమావేశాల్లో ప్రధాన ఎజెండా అవుతాయనడంలో సందేహం లేదు. రాష్ట్ర ప్రజల డబ్బుతో తన స్వార్థం కోసం చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను మాత్రం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఓటుకు కోట్లు కేసు విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో సంపాదించిన అవినీతి సొమ్మును తెలంగాణాలో కొనుగోళ్ళకు ఉపయోగించడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజల కష్టాలతో సంబంధం లేకుండా మొత్తం టైం తన రాజకీయ వ్యవహారాలకే చంద్రబాబు వినియోగిస్తూ ఉండడంపై మాత్రం ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.