రీసెంట్‌గా ఒక సీనియర్ టిడిపి నాయకుడితో కలిసి పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే ఒక సాధారణ ప్రశ్న అడగడం జరిగింది. వెంటనే ఆ సీనియర్ నాయకుడు బిజెపిని వీడాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని సీరియస్‌గా తప్పుపట్టాడు. నాలుగేళ్ళుగా వైఎస్ జగన్‌ని ఆడిస్తూ ఉన్నాను అని చంద్రబాబు అనుకుంటున్నాడు కానీ అన్నీ కూడా జగన్ చెప్పినట్టుగా చంద్రబాబు ఆడుతున్నాడని ఆ నాయకుడు చెప్పుకొచ్చాడు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ నిర్ణయాలన్నీ కూడా జగన్ రాజకీయ వ్యూహాలు, మాటలకు ప్రభావితమవుతూ చంద్రబాబు చర్యలు ఉంటున్నాయని…… అలాంటి ఆవేశంలోనే బిజెపితో తెగతెంపులు నిర్ణయం తీసుకున్నాడని ఆ నాయకుడు ఆవేదనతో చెప్పాడు. ఆ ఆవేదనకు కారణం ఏంటంటే ఇఫ్పుడు ఎటు నుంచి ఏం ముప్పు వస్తుందో అన్న టెన్షన్ పచ్చ బ్యాచ్‌లో కనిపిస్తోంది మరి.
కర్ణాటక ఎన్నికలు ముగియగానే శేఖరరెడ్డికి వందల, వేల కోట్ల కొత్త నోట్ల కట్టలు డైరెక్ట్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో ఉన్న బ్యాంకుల నుంచి వెళ్ళిన కేసులో చినబాబుని బుక్ చేయడం ఖాయం అన్న వార్త వినిపిస్తోంది. నోట్ల రద్దు తర్వాత నుంచీ చోటు చేసుకున్న భారీ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ ఆర్బీఐ తవ్వితీస్తోంది. కన్నడ ఎన్నికలు అవగానే చెన్నై శేఖరరెడ్డి కేసులు చినబాబు అరెస్ట్ ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు కెసీఆర్ కూడా చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చాడు. తెరవెనుక ఒఫ్పందాల విషయంలో కూడా కెసీఆర్‌ని మోసం చేస్తూ 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్‌ని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు చంద్రబాబు. ఇప్పుడు ఈ రాజకీయ కుట్రలే కెసీఆర్‌కి కిర్రెక్కేలా చేశాయి. అందుకే ఓటుకు కోట్లు కేసును కెసీఆర్ బయటకు తీశాడని తెలుస్తోంది. ఈ కేసు విషయంలో కూడా అతి త్వరలోనే అరెస్టుల పర్వాన్ని మొదలెట్టనున్నాడు కెసీఆర్. అదే జరిగితే మాత్రం అరెస్టుల లిస్టులో చంద్రబాబు పేరు కూడా ఉండడం ఖాయం. లైవ్‌లో దొరికిపోయినది రేవంత్‌రెడ్డి అయినప్పటికీ బాబు బ్రీఫ్డ్ మీ వాయిస్‌తో పాటు విచారణలో మొత్తం అక్రమ వ్యవహారాన్ని నడిపించిన సూత్రధారి చంద్రబాబే అని చెప్పడానికి అవసరమైన సాక్ష్యాలు బలంగా ఉన్నాయని విచారణ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఎలా చూసినా కూడా పెదబాబు, చినబాబులకు గడ్డుకాలం మాత్రం మొదలైనట్టే. ఇప్పుడిక తెరవెనుక మేనేజ్‌మెంట్స్ ఏమైనా వర్కవుట్ అవుతాయేమో చూడాలి. అక్కడ కూడా ఫెయిల్ అయితే మాత్రం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాయకుడు, నిప్పు వారసత్వాన్ని కొనసాగిస్తున్నానని చెప్పుకునే చినబాబులకు శ్రీకృష్ణ జన్మస్థాన వాసం తప్పే అవకాశం లేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.