Saturday, May 3, 2025
- Advertisement -

మా కోసం నువ్వు వచ్చావు..మీ కోసం మేము వస్తాం!

- Advertisement -

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. 2021లో విడుదల అయిన పుష్ప 1 చిత్రానికి సీక్వెల్ గా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే పుష్ప 2 మేనియా మొదలైంది.

ఇక ఏపీలో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పుష్ప 2 రిలీజ్‌కు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా ఇందులో జగన్, పవన్, చిరంజీవి అంతా ఒకే బ్యానర్‌లో ఉండటం విశేషం.

అలాగే జగన్‌ – అల్లు అర్జున్ ఫోటోలతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నంద్యాల వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తరపున ప్రచారం చేశారు అల్లు అర్జున్. ఇది పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా పవన్‌కు అండగా నిలవగా బన్నీకి వైసీపీ మద్దతు ప్రకటించింది.

ఇప్పుడే ఇదే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఫ్లెక్సీలపై కనిపించింది. మా కోసం నువ్వు వచ్చావు…మీ కోసం మేము వస్తాం… మీ అభిమానం కోసం దేనికైనా తగ్గేదేలే అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -