ఏపీ రాజకీయానలు పోవలవరం ప్రాజెక్టు కాక రేపుతోంది. ప్రాజెక్టు కొత్త టెండర్లను ఆపండంటూ కేంద్ర రాష్ట్రానికి లేఖ రాయడంతో రాజకీయం హీటెక్కింది. ఈ ఇష్యూ మిత్ర పాక్షాల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది. భాజాపా, టీడీపీ రెండు పార్టీలు ఒకరిమీద ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారాస్థాయికి చేరాయి. దీనికంతటికి కారణం చంద్రబాబ చేసిన వ్యాఖ్యలే.
2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇస్తామని ఇన్నాల్లు చంద్రబాబు, మంత్రులు ఊదర గొట్టారు. పోలవరాన్ని కేంద్రాంనికి అప్పజెప్పకుండా కమీషన్లకోసమే రాష్ట్రప్రభుత్వం తీసుకుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపనలు ఇప్పుడు నిజమయ్యాయి. పోవలరం ప్రాజెక్టును ఇప్పటికిప్పుడు కేంద్రం అడిగితే ఇచ్చేస్తానని తాజాగా అసెంబ్లీలో ప్రకటించారు.
ఇక అసలు విషయానికి వస్తే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు, ప్రధానులను , రాష్ట్రపతులను నేనె ఎంపిక చేశానని ప్రతీ సందర్భంలో బాబు సొంత డబ్బా కొట్టడం చూశాం. ఇలా తనను తాను గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు కేంద్రానికి ఎందుకు భయపడుతున్నారు…? విభజన చట్టప్రకారం ఏపీకి రావాల్సి హామీలను రాబట్టడంలో ఎందుకు విఫలం అవుతున్నారు…? నిప్పు అని సొంత డబ్బా కొట్టే బాబు నిజాయితీ ఎక్కడకు పోయింది…? కాకెత్తుకు పోయిందా…?
కేంద్రం, రాష్ట్రంలోను భాజాపా-టీడీపీ అధికారాన్ని పంచుకుంటున్నారు. అలాంటప్పుడు విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఏవిధంగా నిధులు విడుదల చేస్తాదో అదే విధంగా ఏపీకీ కూడా విడుదల చేస్తోంది.
భాజాపాపై విమర్శలు చేయవద్దని పార్టీ నాయకులను హెచ్చరించిన బాబు సహనం కోల్పోయి కేంద్రంపై మాటల దాడిని పెంచారు. ఒక రోజు గడవక ముందే బాబు న్యూటర్న్ తీసుకున్నారు. ఎవరూ కూడా భాజాపా మీద విమర్శలు చేయవద్దని సూచించారు.
ప్రధానమంత్రి ఏపీకీ తన జేబులో నుంచి డబ్బు ఇవ్వడంలేదనేది గమనించాలి. పార్లమెంటు చేసిన విభజన చట్టాన్ని అమలు చేయండని అడగడానికి బాబు ఎందుకు భయపడుతున్నారో ఎవరికి అర్థం కావడంలేదు. ప్రధానంగా కమీషన్లకోసం, ఓటుకునోటు కేసులో అడ్డంగా ఇరుక్కోవడం వల్లే కేంద్రం ఎక్కడ కేసులో ఇరికిస్తుందాని భయపడుతున్నారా..? చట్టబద్ధంగా రాష్ట్రానికి రావల్సినవి అడగలేకపోవడానికి ఏదో కారణం ఉంటుంది. ఏదోకొ రోజు నిజం బయటపడకుండా ఉండదు. మరి అప్పుడయినా బాబు జవాబు చెప్పుకోవాలి.