నాగబాబు తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. విజయవాడలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్పై సెటైర్లు వేశారు. చినబాబు లోకేష్ మీద పవన్ బోలెడు అవినీతి ఆరోపనలు చేశారు. అయితే ఈసారి ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా పనిచేయడం మీద పరోక్షంగా సెటైర్ వేశారు. తన సోదరుడిని రాజకీయాల్లోకి దొడ్డిదారిన కాకుండా.. రాజ మార్గంలో తీసుకువచ్చానని లోకేష్‌కు చురకలంటించారు.
రాజమార్గంలో తన అన్నయ్యను.. ప్రజాక్షేత్రంలో నిలబెట్టానని ఆయన అన్నారు. ప్రజల తీర్పును తాము గౌరవిస్తామని చెప్పారు. జనసేన తరుపున నరసాపురం ఎంపీగా నాగబాబు పోటీ చేస్తున్నారు. లోకేష్ నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకుండా ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రిగా అధికారం చేపట్టారు. దానిమీద అన్నివైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.