Sunday, May 4, 2025
- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారానికి జ‌గ‌న్ బ్రేక్‌….కార‌ణం అదేనా…?

- Advertisement -

అధికారంలోకి రావాల‌ని వైఎస్ జ‌గ‌న్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. పోలింగ్‌కు ఎక్కు వారంరోజులే గ‌డువు ఉండ‌టంతో రాష్ట్రం అంత‌టా సుడిగాలి ప‌ర్య‌ట‌న నిర్వ‌హిస్తున్నారు. బ‌హిరంగ స‌భ‌ల‌తో ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. తాజాగా ప్ర‌చారానికి బ్రేక్ ఇచ్చారు. ఇది ఎన్నిక‌ల వ్యూహంలో భాగ‌మ‌ని పార్టీ వ‌ర్గాలునుంచి స‌మాచారం. సోమవారం సాయంత్రం ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్ లోటస్‌పాండ్‌కు చేరుకున్నారు.

ఎన్నికల వ్యూహంపై ఆయన మంగళవారం పార్టీ నాయకులతో సమావేశమై చర్చిస్తారు. అలాగే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. దీనితో పాటు ఇప్పటి వరకు జరిపిన ప్రచార సరళిపై ఆయన పార్టీ నేతలు మంతనాలు జరపనున్నారు.జగన్ బుధవారం తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 3న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు.

బుధవారం ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి, 11.30 గంటలకు గురజాల, మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలు, మధ్యాహ్నం 3.30 గంటలకు కృష్ణా జిల్లాలోని మైలవరంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో జగన్‌ ప్రసంగిస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -