Sunday, May 4, 2025
- Advertisement -

రామోజీ ద్వారా కన్నాతో మోడీకి బాబు పంపిన రాయబేరం ఏంటి?

- Advertisement -

లోక్ సత్తా జేపి, జేడీఎస్ లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్, అశోక్ బాబు…..ఇంకా ఢిల్లీలో ఉన్న ఒక పెద్దాయన…..అందరూ ఎవరికివాళ్ళే అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఒక్క అవసరానికి మాత్రం అందరూ ఇతోధికంగా సాయపడుతూ ఉంటారు. అలా సాయపడేలా చేసే కీ మాత్రం రాజగురువు రామోజీరావే అని సీనియర్ జర్నలిస్టులు సాక్ష్యాలతో సహా నిరూపిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ వెన్నుపోటు కాలం నుంచీ నడుస్తున్న కథ ఇదే. కానీ పైకి మాత్రం జగన్‌ని బూచీగా చూపిస్తూ ఉంటారు.

ఆపరేషన్ గరుడ అని రాజగురువు కథ, స్క్రీన్ ప్లే అల్లితే చంద్రబాబు దర్శకత్వంలో సినిమా నటుడు శివాజీ నోట వినిపించిన కథ ఒకటి ఉంది. పచ్చ మీడియా మొత్తం గట్టిగానే ఆ కథను జనాల్లోకి పంపించాయి. వెంకన్నస్వామికి కూడా ఆపరేషన్ గరుడతో ప్రమాదం ఉందన్నంత రేంజ్‌లో చంద్రబాబు అధికారం కోసం వెంకటేశ్వరస్వామిని కూడా బాగా వాడేస్తున్నారు. అయితే ఆపరేషన్ గరుడలో పార్ట్ అంటున్న పవన్, జేడీఎస్ లక్ష్మీనారాయణలకు ఏ మీడియాలో ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందో చూశారా? పవన్, జేడీలు జగన్‌ పార్టీకి లాభం చేసే వ్యక్తులే అయితే ఆంధ్రజ్యోతిలో కనీసం వాళ్ళ పేర్లు అయినా కనిపిస్తాయా? మినిమం కామన్‌సెన్స్ ఉన్నా అసలు విషయం ఇట్టే అర్థమయిపోతుంది.

2019 ఎన్నికల్లో మోడీ, పవన్, చంద్రబాబులో మరోసారి కలిసి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఛీ కొడతారు అన్న నిజం తెలిసే అందరూ విడిపోయినట్టుగా కొత్త నాటకం మొదలెట్టారు. బాబును మోడీ ఏదో చేస్తాడని బాబు కూడా చెప్పుకున్నాడు. పచ్చ మీడియా మొత్తం హాహాకారాలు చేసింది. ఏమైనా జరిగిందా? ఇక ఇప్పుడు తాజాగా కన్నా లక్ష్మీనారాయణ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి రాజగురువును కలిశారు. ఏం పథక రచన చేసి ఉంటారు? రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు స్వయంగా వెళ్ళి టిడిపికి మద్దతుదారును అని బహిరంగంగానే చెప్పుకునే రామోజీతో ఏం మంతనాలు చేసినట్టు? బాబును నడిపించే వ్యక్తుల్లో ప్రధాన సభ్యుడైన రామోజీతో కన్నా భేటీ వెనకాల బిజెపి అధిష్టానంతో బాబు అండ్ కో నడిపించాలనుకుంటున్న వ్యూహం ఏంటి?

ఆ విషయాలన్నీ ముందు ముందు బయటపడతాయి. ఒకటి మాత్రం నిజం. 2019 ఎన్నికల తర్వాత అవసరం అయితే బాబు, పవన్, మోడీలు మళ్ళీ కలుస్తారు…….ఇక ఇప్పుడు రాష్ట్రంలో తిరుగుతున్న వందిమాగదులందరూ కూడా బాబుకు ఎలా సాయపడాలా అనే వ్యూహంలో ప్రజల ముందుకు వచ్చినవాళ్ళే. ముప్ఫై ఏళ్ళుగా పచ్చ రాజకీయాలను చూస్తున్న వాళ్ళెవ్వరికైనా ఈ విషయాలు ఇట్టే అర్థమవుతాయనడంలో సందేహం లేదు. కాకపోతే 2014 ఎన్నికల్లో మోసపోయినట్టుగానే ప్రజలు మరోసారి పచ్చ ప్రచారంలో పడి మోసపోతారా అన్న విషయం మాత్రం రాజకీయ విశ్లేషకుల్లోనూ ఆసక్తి పెంచుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -