Sunday, May 4, 2025
- Advertisement -

కన్నా తప్పు.. బీజేపీ వర్సెస్ వైసీపీగా మారింది..

- Advertisement -

లాగేయాలి.. అందరినీ తమలో కలిపేసుకొని ప్రాంతీయ పార్టీలను తుత్తు నియలు చేయాలి.. ఇప్పుడు బీజేపీకి ఇదే టార్గెట్ అందుకే వెనుకా ముందు ఆలోచించకుండా బీజేపీ చేరికల పర్వాన్ని మొదలు పెట్టింది. కానీ ఇప్పుడు బీజేపీలోకి ఆ ఆత్యాశతో కేసులున్నవారు.. లైంగిక ఆరోపణలున్న వారు వచ్చి చేరుతున్నారు. చేరికలే పరమావధిగా ఆ పార్టీ కూడా ఏపీలో బలం పెంచుకోవడానికి సై అనేస్తోంది. ఇప్పుడు ఒక వ్యక్తి చేరిక బీజేపీ, వైసీపీల మధ్య చిచ్చు పెట్టింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైఖరిపై బీజేపీ దుమ్మెత్తి పోస్తోంది.

తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా సమక్షంలో కోటి అనే వ్యక్తి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయన పెద్దనేత ఏం కాదు.. పేరు ప్రఖ్యాతలు లేవు. అయినా కన్నా వెనుకా ముందు చూడకుండా బీజేపీ కండువా కప్పేశారు. ఇప్పుడు అతడెవరో కనిపెట్టి వైసీపీ అభిమానులు.. నేతలు బీజేపీ అధ్యక్షుడు కన్నాపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మొన్నటి ఎన్నికల వేళ వైసీపీ నాయకురాలు, దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిపై కొందరు తెరవెనుక శక్తులు కుట్రపన్ని ఆరోపణలు చేయించారు. ఆమె వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న కోటి అనే వ్యక్తి చేత లక్ష్మీపార్వతి లైంగిక వేధింపులు చేస్తోందని మీడియాలో రచ్చ చేశారు. అయితే పోలీసులు మాత్రం కోటిని విచారించి దీనివెనుక తెరవెనుక కొందరు స్వార్థ పూరిత రాజకీయ శక్తులు ఉన్నారని తేల్చారు. కోటి యే వారికి అమ్ముడు పోయి లక్ష్మీపార్వతిపై ఆరోపణలు చేశారని కోటిపై కేసులు పెట్టారు.

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో అక్రమాలకు పాల్పడ్డ కోటి లో ఆందోళన మొదలైంది. నాడు ఎవరి ప్రోద్బలంతోనో వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతిపై ఆడిపోసుకున్న కోటి ఇప్పుడు తనను వైసీపీ ప్రభుత్వం ఊరికే వదలిపెట్టదని భావించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. కన్నా చూసుకోకుండా కండువా కప్పేశాడు.

బీజేపీలోకి కోటి చేరికపై వైసీపీ నాయకులు, సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటువంటి కేసులు మాఫీ చేసుకునేందుకు బీజేపీలో చేరారని.. లైంగిక ఆరోపనలు చేసిన వ్యక్తిని చేర్చుకుంటారా కాపాడుతారా అని మండిపడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తీరును ఎండగడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -