జగన్ మొదలు పెట్టిన ప్రజాసంకల్పయాత్ర అధికారపార్టీ నేతల్లో అలజడి మొదలయ్యింది. అడుగడుగునా ప్రజలు నీరాజనం పడుతుండటంతో పచ్చపార్టీ నేతల్లో వణుకు మొదలయ్యింది. ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతోపాటు జగన్ ఇస్తున్న హామీలను చూసి ఏకంగా సీఎం చంద్ర బాబులో ఆందోళన కనబడుతోంది.
బాబు ఏదైనా రాజకీయంగా కలసి వస్తుందంటేనే సంక్షేమం గురించి ఆలోచిస్తారనె ఆరోపణలున్నాయి. తాజాగా బాబు మత్స్యకారులకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాననడం చూస్తె బాబులో ఎంతటి ఆందోళన మొదలయ్యిందో చెప్పవచ్చు. ఓ కార్యక్రమంలో మత్య్సకారులందరకీ 50 ఏళ్ళకే పింఛను సౌకర్యం కల్పిస్తానని బాబు ప్రకటించారు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా మత్స్యకారుల బడ్జెట్ ను రూ. 187 కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు కూడా చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న వృద్ధాప్య, వితంతు, వికాలంగ పింఛన్లకు అధికభాగం నిధులు కేంద్ర ప్రభుత్వంనుంచె వస్తున్నాయి. వృద్దాప్య పింఛన్లైనా, వికాలాంగ, వితంతు పింఛన్లయినా కులం, మతంతో సంబంధం లేకుండా అర్హులైన వారికి ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇంత హటాత్తుగా చంద్రబాబుకు మత్స్యకారుల పింఛన్ వయస్సును 50 ఏళ్ళకే తగ్గించాలని ఎందుకు అనిపించిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇదంతా జగన్ ప్రభావం అనే తెలుస్తోంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వివిధ సామాజికవర్గాలకు జగన్ అనేక హామీలు ఇస్తున్నారు. పింఛన్ల హామీకూడా అందులో ఒకటి. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకు పింఛన్ వయోపరిమితిని 45 ఏళ్ళకే తగ్గిస్తానని ప్రకటించారు. రాబోయోది ఎన్నికల కాలం కాబట్టి బాబు ఆందోళన చెందుతున్నారు.