మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే చంద్రబాబు.. ఓ యువనేత చూపిన బాటలో ప్రయాణిస్తూ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓ సమస్యపై సమగ్రంగా విచారించి.. దాని లోతుపాతులను తెలుసుకొని దానికో సోల్యూషన్ ఇస్తూ.. దానిని అమలు చేయాలంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పోరాడుతున్నారు. చెప్పిన వెంటనే చేస్తే అందరూ ఏమనుకుంటారో అని అనుకుంటున్నారో అని కొంచెం లేట్‌గా అయినా ఆయన దారిలోనే చంద్రబాబు వెళుతున్నారంటున్నారు విశ్లేషకులు.
ఏపీకి సంజీవని లాంటి హోదా విషయంలో మొదలుపెడితే.. ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాల వరకు ఇప్పటివరకు జగన్ బాటలోనే నడిచారు చంద్రబాబు. హోదా కోసం ఢిల్లీలో జగన్ దీక్ష చేస్తే.. అదో పనికిమాలిన పనిగా అభివర్ణించిన చంద్రబాబు.. రెండేళ్లు గడవక ముందే అదే రాజధానిలో కూర్చొని హోదా కోసం దీక్ష చేశారు. జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అమెరికా బడ్జెట్ కూడా సరిపోదని ఎద్దేవా చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు అవే పథకాలు ప్రకటించి.. మళ్లీ గెలిపిస్తే అమల్లోకి తేస్తామంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగుతున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో చంద్రబాబు.. జగన్‌ను ఫాలో అవుతున్నారంటున్నారు వైఎస్ఆర్‌సీపీ నేతలు.
రాష్ట్రంలో జగన్ ఎజెండా సెట్ చేస్తుంటే.. చంద్రబాబు ఫాలో అవుతున్నారన్నారు ఇటీవలే వైఎస్ఆర్‌సీపీలో చేరిన పిల్లి కృపారాణి. రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యపై జగన్‌కు అవగాహన ఉందని.. వారిని రూపుమాపేందుకు ప్రణాళికలు ఉన్నాయన్నారు ఆమె. రాష్ట్రానికి యూటర్న్ నేత కావాలో.. లేక నిజమైన నాయకుడు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.