Thursday, March 28, 2024
- Advertisement -

ఐదు నెలల తర్వాత బయటకు వెళ్తున్న జగన్..!

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూలులో సీటు సాధించారు. కుమార్తెను డ్రాప్ చేయడం కోసం దాదాపు ఐదు నెలల తర్వాత రాష్ట్రం దాటి వెళ్తున్నారు. ఈ నెల 25న జగన్ బెంగళూరుకు వెళ్లి 26వ తేదీ కూడా అక్కడే ఉండి 27వ తేదీన తాడేపల్లికి రిటర్న్ కాకున్నారు.

కూతుర్ని పారిస్ కు పంపేందుకు జగన్ బెంగళూరుకి వెళ్తున్నాడని తెలుస్తోంది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా జగన్ ఏపీలోనే ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలవాలని అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత జగన్ ఏపీని దాటి వెళ్లాలనుకుంటున్నారు. ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలు ప్రపంచంలోని టాప్ 5 యూనివర్సిటీలలో ఒకటి.

హర్షారెడ్డి ఇప్పటికే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమెకు అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ హర్షా రెడ్డి ఉద్యోగాని వదిలేసి.. ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మాస్టర్స్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. చిన్న వయస్సు నుంచి హర్షారెడ్డి ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్ సాధించడం గమనార్హం. సీఎం కూతురు సీటు సాధించడంతో వైసీపీలో సందడి నెలకొంది.

రామ్ సినిమాలు కమ్మవాళ్లే చూస్తారా.. చంద్రబాబే ముప్పు : వల్లభనేని వంశీ

జగన్ శ్రీశైలం పర్యటన వాయిదా.. ఏం జరిగింది ?

జగన్ సర్కార్ కి హైకోర్టు లో షాక్ మీద షాక్..!

విడ‌ద‌ల ర‌జిని పై రాజకీయ కుట్ర..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -