వైఎస్ జగన్ సంకల్పయాత్ర టిడిపి నేతల్లో గుబులు రేపుతున్నట్టుంది. ఆ పార్టీ భజన మీడియాలో ప్రచారం లేకుండా చేస్తున్నారు. జగన్ పాదయాత్రకు జనాలు రాకుండా చాలానే ప్రయత్నాలు చే్స్తున్నారు. పోలీస్ యంత్రాంగం మొత్తం జగన్ పాదయాత్రను ఫ్లాప్ చేయడానికి ఎక్కడికక్కడ ఫ్లాప్ చేయాలన్న ఆరాటంతో వర్క్ చేసేలా చేశారు. కానీ అవేవీ కూడా వర్కవుట్ కావడంలేదని, జగన్ పాదయాత్రకు భారీగా జనాలు వస్తున్నారని చంద్రబాబు తెప్పించుకుంటున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మీడియాలో ఎలాగూ ఎక్కువ భాగం బాబు భజన మీడియానే కాబట్టి మేనేజ్ చేయగలుగుతున్నారు గానీ సోషల్ మీడియాలో మాత్రం నెటిజనులు పాదయాత్ర ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆయా ఫొటోల్లో జగన్ చుట్టూ ఉన్న జన సంఖ్యను చూసి టిడిపి నేతలు ఆశ్ఛర్యపోతున్న పరిస్థితి. అందుకే జగన్ పాదయాత్ర గురించి మాట్లాడకుండా ఉండాలని, జగన్ పాదయాత్రకు ప్రాధాన్యత ఇవ్వకూడదని ఎంతగా నోరు కట్టేసుకుందామనుకున్న ఉక్రోషాన్ని ఆపుకోలేకపోతున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి అలానే బయటపడ్డాడు. ప్రజలతో మమేకం అయ్యే విషయంలో జగన్‌ని మించిన నాయకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేడన్నది నిజం. మరీ చంద్రబాబు అయితే ప్రజలకు బారెడు దూరంలో ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. శుచీ శుభ్రత అనుకుంటాడో లేక అత్యంత అనుభవజ్ఙుడిని, ప్రపంచానికి పాఠాలు చెప్పిన పోటుగాడిని అయిన తనను సామాన్య ప్రజలు సన్నిహితంగా ఉండి తాకడం ఏంటి అని భావిస్తాడో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం ఎప్పుడూ ప్రజలతో మమేకమైంది లేదు. కానీ జగన్ మాత్రం పూర్తిగా ప్రజల్లో కలిసిపోతాడు. ముసలి వ్యక్తులను, చిన్న పిల్లలను అయితే గుండెలకు హత్తుకుంటూ ఉంటాడు. ఒక ప్రతిపక్ష నేత ఈ స్థాయిలో ప్రజలతో కలిసిపోవడం, ప్రజలకు దగ్గరవడం నిజంగా గొప్ప విషయమే. ప్రజా జీవితంలో ఉన్నాం అని చెప్పుకుంటూ కనీసం ఆ ప్రజలకు సమీపంగా వెళ్ళడానికి కూడా ఆలోచిస్తూ, ముక్కు మూసుకుని మరీ ప్రజలకు దూరంగా ఉండే నేతలకంటే ప్రజలతో పూర్తిగా కలిసిపోయే నాయకులకు ప్రజల కష్టసుఖాలు కాస్త ఎక్కువగా తెలుస్తాయన్నది నిజం.
ప్రజలతో కలిసిపోయే విషయంలో చంద్రబాబుకు జగన్‌కి అసలు పోలికే లేదన్న విషయం పచ్చ బ్యాచ్‌కి కూడా తెలుసు. అందుకే జగన్ ప్రజలతో మమేకమవడాన్ని అత్యంత నీచమైన అర్థాలతో వక్రీకరిస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో టిడిపి పెయిడ్ వర్కర్స్ అందరూ కూడా ముసలి వయసు వాళ్ళను జగన్ దగ్గరకు తీసుకున్న ఫొటోలు చూపిస్తూ నీచమైన కామెంట్స్ పెట్టడాన్ని చూశాం. మామూలుగా అయితే సొంత అవ్వా, తాతలను దగ్గరకు తీసుకోవడానికి కూడా చాలా మంది ఇబ్బందిపడుతూ ఉంటారు. కానీ జగన్ మాత్రం వాళ్ళను తన సొంత తల్లిదండ్రులు అన్నంత ప్రేమగా దక్కరకు తీసుకుంటాడు. ఇప్పుడు ఈ విషయాన్ని అత్యంత నీచంగా చూశాడు టిడిపి మంత్రి జవహర్. జగన్ ముద్దులను మరో అర్థంలో చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో టిడిపి పెయిడ్ వర్కర్స్ ప్రచారం చేస్తున్న నీచమైన అర్థంలోనే ఎక్సైజ్ మంత్రి జవహర్ మాట్లాడాడు. మంత్రి మాట్లాడిన మరుక్షణం నుంచే సోషల్ మీడియాలో జవహర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ మధ్య ఒకసారి బీరును హెల్త్ డ్రింక్‌గా అభివర్ణించింది కూడా ఈ మంత్రివర్యులే. అందుకే నెటిజనులు అందరూ కూడా బీరును హెల్త్ డ్రింక్‌గా చూడగలిగిన మంత్రికి జగన్ ముద్దులు మాత్రం మరోలా కనిపించడంలో ఆశ్ఛర్యం ఏముంది? టిడిపి నేతల బూతు స్థాయి అది అని విరుచుకుపడుతున్నారు. సభ్యత, సంస్కారం, క్రమశిక్షణగల పార్టీ టిడిపి అని చెప్పకునే చంద్రబాబు పార్టీ అసలు రంగులు ఇంత నీచంగా ఉంటాయని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.