నం ద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారం హద్దులు దాటుతోంది. ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న విమర్శలు వ్యక్తిగతం వైపు వెల్తున్నాయి.ఉప ఎన్నిక ఎంత వేడి పుట్టిస్తుందో ..వారి మాటలు కూడా అంతే రీతిలో కాక పుట్టిస్తున్నాయి.అఖిల ప్రియ డ్రస్సు గురించి రోజా చేసిన వ్యాఖ్యలపై మంత్రులు మండి పడ్డారు.తీవ్ర అసభ్య పదజాలంతో మాట్లాడారు.
తాజాగా మంత్రి ఆదినారాయన రెడ్డి రోజాపై చేసిన వ్యాఖ్యలు హాట్‌గా మారాయి. రోజాలాంటి వారు వస్త్రధారణపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బట్టలు లేకుండా తిరిగే వాళ్లకు వస్త్రధారణపై మాట్లాడే అర్హత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిలప్రియపై రోజా ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నికలో ఓటుకు రూ. 5 వేలు పంచినా తమ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఎన్నిక పూర్తయ్యేనాటికి ఇలాంటి అనుచిత మాటలు ఇంకెన్ని చూడాలో.