ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు చుట్టు ఉన్న దారులు రోజురోజుకు సంక్లిష్టమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక చంద్రబాబే ప్రధాన కుట్రదారేనని సీఐడీ పక్కా ఆధారాలతో నిగ్గుతేల్చింది. అయితే ఈ వ్యవహారంలో కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని మరోసారి తిప్పికొట్టింది సీఐడీ.
పక్కా సాక్ష్యాధారాలతో చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారని ఇందుకు సంబంధించిన ఆధారాలను రిలీజ్ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి నిధుల విడుదల, బడ్జెట్ ఆమోదం, కౌన్సిల్ సమావేశాలపై సంతకం చేసే ఫారమ్‌లతో సహా 13 చోట్ల బాబు సంతకాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే కేబినెట్ అనుమతి లేకుండానే ఈ మొత్తం వ్యవహారం నడిచింది. ఈ స్కామ్ లో రూ.241 కోట్లు నేరుగా షెల్ కంపెనీలకు వెళ్లాయని వెల్లడించింది సీఐడీ. ఇందుకు సంబంధించిన ఆధారాలను చార్జీషిట్‌లో సైతం వెల్లడించింది.

చంద్రబాబుతో పాటు సీమెన్స్,డిజైన్ టెక్ సంస్థల ప్రతినిధులు నిందితులుగా ఉన్నారు. జీవోలో పొందుపరిచిన అంశాలకు భిన్నంగా అగ్రిమెంట్ ఉండటం…. అగ్రిమెంట్ లో 330 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పడం వెనుకే దుర్భుద్ధి కనపడుతుందని సీఐడీ అధికారులు ఆరోపించారు. అయితే తమకు 58.8 కోట్లు మాత్రమే అందాయని సీమెన్స్ సంస్థ స్పష్టత ఇచ్చిందని గుర్తుచేశారు అధికారులు. సీమెన్స్ యాజమాన్యం కూడా ఈ ఘటనపై స్పందించిందన్నారు. తమ ఇండియా ఉద్యోగులు వాస్తవాలు చెప్పకుండా వ్యవహరించారని …స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో విధి విధినాలు పాటించలేదని తెలిపిందన్నారు. ఏసీబీ కోర్టు ఈ ఆధారాలను పరిశీలించాకే చంద్రబాబుకు రిమాండ్ విధించిందన్నారు.
దీంతో చంద్రబాబు దోషని ప్రజాక్షేత్రంలో మరోసారి రుజువుకాగా ఈ కేసుతో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ వర్క్ స్కాంలో బాబుకు మరిన్ని చిక్కులు కనిపించేలా ఉన్నాయి. ఇక ఈ కేసులో చంద్రబాబును విచారణ కోసం సీఐడీ కస్టడీకి అప్పగిస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.