Saturday, April 20, 2024
- Advertisement -

టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుంది: బండి సంజ‌య్

- Advertisement -

తెలంగాణ‌లో సాగ‌ర స‌మరం మొద‌లైంది. నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది ప్ర‌ధాన పార్టీల‌న్ని ప్రచారంలో జోరు పెంచాయి. ఇత‌ర పార్టీల‌ను ఇరుకున పెట్టే విధంగా ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. క‌మ‌ళ నేత‌లు సైతం అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లతో రెచ్చిపోతున్నారు.

తాజాగా తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్, ఆ పార్టీ మ‌హిళా నేత విజ‌య శాంతి సహా ప‌లువురు కీల‌క నేత‌లు నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ ర‌వి కుమార్ ను గెలిపించాల‌ని బండి ప్ర‌జ‌ల‌ను కోరారు. ఆధికార టీఆర్ ఎస్ పార్టీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని ఎద్దేవా ఆయన చేశారు.

తాము ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచి పోరాడుతుంటే… ఆధికార పార్టీ మాత్రం త‌మ‌పై అక్ర‌మంగా కేసులు పెట్టిస్తున్న‌ద‌ని ఆరోపించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిధుల‌పై చ‌ర్చించ‌డానికి కేసీఆర్ సిద్ధ‌మా? అంటూ ప్ర‌శ్నించారు. అలాగే, విజ‌య‌శాంతి మాట్లాడుతూ.. ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని చెప్పి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ మోసం చేశార‌ని అన్నారు. రాష్ట్రంలో భూముల కబ్జాలు పెరిగిపోయాయ‌ని పేర్కొన్నారు.

భారత తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా సుశీల్ చంద్ర

దేశంలో కరోనా ఉధృతి.. ఒకే రోజు 1.68 ల‌క్ష‌ల మందికి పాజిటివ్

మాస్కులు ధరించని వారిపై పోలీసులు కొరడా !

అల్లు అర్జున్ పుష్ఫ.. ఆ టైంకు వ‌చ్చేనా?

ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్‌ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -