Tuesday, May 6, 2025
- Advertisement -

జగన్‌లో వచ్చిన అతి పెద్ద మార్పు ఇదే……. సీట్ల ఎంపికలో షాకింగ్ డెసిషన్స్

- Advertisement -

గోదావరి జిల్లాల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో సహా చాలా మందికి షాకుల మీద షాకులు. ఇక నిన్న ఒంగోలు విషయంలో సొంత బంధువు వైవీ సుబ్బారెడ్డికి షాక్. తాజాగా గుంటూరు జిల్లాలో కూడా తన సన్నిహితుడికి షాక్ ఇచ్చాడు జగన్. ఈ మొత్తం వ్యవహారాలన్నీ చూస్తున్న వైకాపా సీనియర్ నేతలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. 2014 ఎన్నికల సమయంలో సీట్ల ఎంపిక విషయంలో పూర్తిగా తన సొంత మనుషులు, తనను నమ్ముకుని ఉన్నవాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చాడు జగన్. అయితే జగన్ సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డిలాంటివాళ్ళతో సహా చాలా మంది ఎన్నికల సమయంలో కష్టపడలేదు. జేసీ దివాకరరెడ్డి సోదరులు లాంటి బలమైన నేతలు వైకాపాలోనికి వస్తానంటే వాళ్ళను కాదని మరీ తనను నమ్ముకున్నవాళ్ళకు సీట్లు కేటాయిస్తే ఆయా నాయకులందరూ కూడా పూర్తిగా భారం అంతా జగన్‌పైన వేసి గెలుపు గ్యారెంటీ అని నిర్లక్ష్యంగా ఉండడం మొత్తం పార్టీ విజయావకాశాలనే దెబ్బతీసింది.

గుంటూరు జిల్లాలో లేళ్ళ అప్పిరెడ్డి కూడా అలాంటి నాయకుడే. జగన్‌కి సన్నిహితుడిని అని చెప్పుకుంటూ ఉంటాడు. 2014 ఎన్నికల్లో గుంటూరు పశ్ఛిమ సీటు నుంచి పోటీ చేశాడు. టిడిపి అభ్యర్థిపై దాదాపు 18వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినప్పటికీ తెలివి తెచ్చుకోలేకపోయాడు. ఎన్నికలు అయిన దగ్గర నుంచీ ఈ నాలుగేళ్ళలో ప్రజల మధ్య ఉండకుండా మరోసారి జగన్ పేరు చెప్పుకుని 2019 ఎన్నికల్లో ప్రజల మధ్యకు వెళ్ళొచ్చు అనుకున్నాడు. అయితే ఈ సారి జగన్ ఇలాంటి సోమరిపోతు సన్నిహితులందరికీ సూపర్ షాకులు ఇస్తున్నాడు. తనకు సన్నిహితులు అయినవాళ్ళకంటే ప్రజల్లో మంచి పేరు ఉన్నవాళ్ళు, నాలుగేళ్ళుగా పార్టీ కోసం కష్టపడిన నేతలకు…….తనలాగే ఎక్కువ కాలం ప్రజల మధ్య ఉన్న నేతలకు సీట్ల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తున్నాడు. జగన్‌లో వచ్చిన ఈ మార్పు వైకాపా సీనియర్ నేతల్లో ఆందోళన పెంచుతున్నప్పటికీ యువ నాయకులు, ప్రజల మధ్య ఉంటూ పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడుతున్న నాయకులకు మాత్రం సంతోషం కలిగిస్తోంది. జగన్ సొంత మనుషులం అని చెప్పుకుంటూ కేవలం జగన్ ఇమేజ్‌పైన ఆధారపడి గెలవాలనుకునే నేతలకంటే జగన్‌లాగే అనుక్షణం ప్రజల్లో ఉంటూ…..పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడే నేతలకు సీట్ల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలన్న జగన్ నిర్ణయం 2019 ఎన్నికల్లో కచ్చితంగా వైకాపాకు కలిసొస్తుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -