2019 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ తమకు రాకపోతే, టీడీపీ మినహా ఏ పార్టీతో అయినా జట్టు కడతామని, అధికారం తమదేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాదవ్ కాకినాడలో చాలా ధీమాగా చెప్పుకొచ్చారు. దానికో ఉదాహరణ కూడా చెప్పేశారు. గతంలో ‘అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు నలుగురే ఉండేవారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అరుణాచల్ ప్రదేశ్ మాదిరిగానే ఇప్పుడు ఏపీలో కూడా బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలున్నారు. త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడా అధికారం చేజిక్కించుకుంటాం. ఒకవేళ తమకు పూర్తి మెజారిటీ రాకపోతే, టీడీపీ మినహా ఏ ఇతర పార్టీతో నైనా పొత్తు పెట్టుకుని మరీ అధికారంలోకి వస్తామని రాంమాధవ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో తప్ప ఇతర పార్టీలతో పొత్తు ఉంటుందని బీజేపీ శ్రేణులకు తెలిపారు. ఇప్పటికే తమ పార్టీ 13 జిల్లాల్లో జిల్లాల వారిగా అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేశారని చెప్పారు.
అయితే రాంమాధవ్ ఏ ధీమాతో ఏపీలో అధికారం తమదేనని చెప్పారో అర్ధం కాని ప్రశ్న. ఇప్పుడున్న నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల, టీడీపీ శ్రేణులు, కార్యకర్తల ఓట్లు వల్ల గెలిచారు. అంతే తప్ప రాంమాధవ్ ముఖం చూసో, నరేంద్రమోడీ ముఖం చూసో జనం ఆ నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలకు ఓట్లు వేయలేదు. పైగా ఏపీకి ప్రత్యేకహోదాపై చేసిన మోసంతో ఆంధ్రులంతా రగిలిపోతున్నారు. మీ కంటే కాంగ్రెస్ నయం కదరా.. చెప్పి రాష్ట్రాన్ని విభజించారు. మీరు హోదా ఇస్తామని నమ్మించి మోసం చేశారని ఆగ్రహంతో ఉన్నారు. మోడీ కాదు కదా వాడి జేజమ్మ వచ్చినా ఏపీలో బీజేపీ అధికారంలోకి రాదని తేల్చి చెబుతున్నారు. అధికారం సంగతి సరే, పట్టుమని పది సీట్లలోనైనా కనీసం డిపాజిట్లు దక్కించుకోవాలని సవాల్ విసురుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రజలంత సౌమ్యులు, అమాయకులు కాదు ఏపీ ప్రజలు, మీరు చేసే మోసాన్ని గుర్తు పెట్టుకుంటాం. గుండెల్లో పగను పెంచుకుంటాం. అంతకంతా పది రెట్లు పగ తీర్చుకుంటామని శపథం చేస్తున్నారు. తమకు ఇష్టం లేకుండా విభజించిన కాంగ్రెస్ కే 130 ఏళ్ల చరిత్రలో ఎన్నడూచూడని రీతిలో కళ్లు బైర్లు గమ్మే తీర్పు గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చారు. 175 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు ఆ పార్టీ అభ్యర్ధులు. రాంమాధవ్ ఏపీని అరుణాచల్ తో పోల్చినప్పుడు గత ఎన్నికల ఫలితాలను కూడా ఓ సారి గుర్తు తెచ్చుకుని పోల్చుకుంటే మంచిది. ఏపీ ప్రజలను మోసం చేస్తే, ద్రోహం చేస్తే ఎంత పెద్ద పార్టీలైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే అత్యంత దారుణంగా బీజేపీ ఏపీలో చావు దెబ్బ తినబోతున్నది అనేది జగమెరిగిన సత్యం.
అలాంటిది అధికారంలోకి వస్తామని, 13 జిల్లాల్లో జిల్లాల వారిగా వ్యూహాలు రచించామని చెబుతున్నారంటే. కచ్చితంగా ఆపరేషన్ గరుడ అమలు చేయబోతున్నారా ? అనే అనుమానాలు వస్తున్నాయి. ఏపీలో పునాదులు కూడా లేని బీజేపీ అధికారంలోకి రావాలంటే, బలంగా పాతుకుపోయి ఉన్న టీడీపీ, వైఎస్ఆర్ సీపీ తుడుచుపెట్టుకుపోవాలి. ఆ రెండు పార్టీలు ఉన్నంతవరకూ బీజేపీ ఏపీలో ఒక్క వార్డ్ మెంబర్ గెలవడం కూడా కష్టమే. అలాంటిది ఏ ధీమాతో అధికారం తమదే అని చెబుతున్నారు. దీని వెనుక ఆపరేషన్ గరుడ కచ్చితంగా అమలు చేస్తారనే అర్ధమవుతోంది. పైగా మెజార్టీ లేకపోతే టీడీపీ మినహా ఏ పార్టీతో అయినా పొత్తులు పెట్టుకుంటామన్నారు. అంటే జనసేన, వైఎస్ఆర్ సీీపీ కనిపిస్తున్నాయి. జనసేన పరిస్థితి ఏంటో ఆ పార్టీ అధినేతకు కూడా అర్ధం కాని పరిస్థితి. ఇక బలంగా ఉన్న వైఎస్ఆర్ సీపీతో ముందే బీజేపీ పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓటు బ్యాంక్ జగన్ కు దూరమైపోయినట్లే. పైగా హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీతో జట్టుకడితే జగన్ కొంప కొల్లేరే. ఆ విషయం జగన్ కు తెలుసు కనుక ఎన్నికల ముందు బీజేపీతో చేతులు కలపడు. పోనీ ఎన్నికల తర్వాత కలిపినా….అధికారం మాదే…అని బీజేపీ ముందే చెబుతోంది అంటే…అర్ధమేంటి ? బీజేపీలో వైఎస్ఆర్ సీపీ విలీనం అయిపోతుందా ? లేకపోతే జగన్ మీద కేసులు ఉన్నాయి కనుక భయపెట్టి ఆయనను బ్లాక్ మెయిల్ చేసి వైఎస్ఆర్ సీపీ మద్దతుతో బీజేపీ అధికారం చేపడుతుందా ? అంటే జగన్ కు సపోర్ట్ చేసినట్టే చేసి, ఎన్నికల తర్వాత, కేసులను సాకుగా చూపి ఆయనకు చావుదెబ్బ కొట్టి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ అధికారం చేపట్టాలనా ? ఏ ఉద్దేశంతో రాంమాధవ్ అంత కచ్చితంగా ఏపీలో అధికారం మాదే…అని చెప్పగలిగాడో…తేల్చి చెప్పాల్సిందే.