తెలంగాణాలో ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో పార్టీల హడా వుడీ మొదలయ్యింది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్తుల ఎంపిక, ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఇక భాజాపా కూడా ఎన్నికలకు సమాయాత్రమవుతోంది. అయితే ఎన్నికల స్టార్ క్యాంపేన్‌గా ఇప్పటి వరకు ఎవరూ లేరు. గతంలో కేంద్ర నాయకులను ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చేసేవారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకుల వల్ల లాభం లేకపోవడంతో అధిష్టానం చూపు పరిపూర్ణానంద స్వామిపై పడింది.
స్వామివారి పొలిటికల్ ఎంట్రీ. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ.. కమ్యూనల్ కార్డ్ తో ఓ వర్గం ఓట్లను వీలైనంత వరకు తమవైపు మళ్లించుకోవడం. యూపీలో యోగి ఆదిత్యనాథ్ లాగా.. తెలంగాణలో పరిపూర్ణానందను ఎక్స్ పోజ్ చేయడం. తెలంగాణ యోగిగా ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లడం.
స్వామీజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు బాగానే ఉన్నారు. దాంతో పాటు అర్ధికంగా ఉండటం, సొంతంగా మీడియా ఛానల్ ఉండటం వల్ల ప్రచారానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.అందుకే స్వామిజీని ఎన్నికల బరిలో దించాలని బీజేపీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఉత్తర ప్రదేశ్‌లో యోగీ లాగా ఇక్కడ కూడా సీఎం అభ్యర్తిగా ఎక్స్‌ఫోజ్ చేసి వీలైంత వరకు లబ్దిపొందడానికి భాజాపా ప్లాన్ వేస్తోంది.కేంద్రంలో.. మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ సర్కారు ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ గౌరవప్రదమైన సీట్లు కూడా రాకుంటే బీజేపీ పరువుపోతుంది. సంవత్సరం ముందే కార్యాచరణను ప్రారంభించి అధిష్టానం దానిలో భాగంగానే స్వామి అమీత్‌షాను కలవడంతోపాటు స్పష్టమైన హామీకూడా స్వామికి వచ్చిందంట. తెలంగాణా ఎన్నికల్లో పరిపూర్ణానంద స్వామి బాణం ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.