వైఎస్ జగన పై ఉన్న అక్రమాస్తుల కేసులపై ఎన్నిక ప్రచారంలో టీడీపీ, జనసేన పార్టీలు విమర్శలు చేస్తున్నారు. భాజాపాతో జగన్ కుమ్మక్కయ్యారని అందుకే ఒక్క మాటల కూడా మాట్లాడంలేదని బాబు చేస్తున్న విమర్శలపై భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామాంధవ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ ను తామేమి కీలు బొమ్మగా ఉపయోగించుకోవడంలేదన్నారు. జగన్ మాతో కలిసుంటె ఈ పాటికి జగన్ పై విచారణ, ఆయన సంస్థల, బంధువుల ఆస్తుల అటాచ్ మెంట్ ఉండేదా? అని ప్రశ్నించారు.
2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని తీవ్రంగా నష్టపోయామన్నారు. బాబు పచ్చి అవకాశవాది రాజకీయాలు చేస్తున్నారని అందుకే గతంలో మేము మోసపోయామని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదన్నారు. ఇకనుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.జగన్ పై కేసులున్నాయని, కేసులున్నాయనే తమను ఏమీ అనడం లేదని, ఏ కేసులూ లేని ఆయన (చంద్రబాబు) రేపు తననేదో చేసేస్తానని రోడ్డు మీద ధర్నాలకు దిగుతున్నాడని ఎద్దేవా చేశారు. బాబు తప్పు చేయకుంటే సీబీై, ఈడీలను రాష్ట్రంలోకి రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీలను బీజేపీ వాడుకుంటోందన్నది తప్పుడు ఆరోపణలని, అలాగే వాడుకుని వుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది జైల్లో ఉండేవారని అన్నారు. గతంలో తప్పులు చేసి ఉండబట్టే చంద్రబాబు ఇప్పుడు భయపడుతున్నారని విమర్శలు గుప్పించారు.