ఏపీలో మిత్ర పక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకానపడుతోంది. గతంలో కంటె ఇప్పుడు టీడీపీపై విమర్శల దాడిని మరింత పెంచింది భాజాపా. నిన్నటి వరకు బాబుకు పక్కలో బల్లెంలా మారిన సోము వీర్రాజుకుతోడు మరో ఎమ్మెల్సీ మాదవ్ తోడయ్యారు. మిత్రపక్షం భాజాపాపై విమర్శలు చేయవద్దని పార్టీ నేతలకు బాబు సూచించినా…. కాషాయం పార్టీనుంచి విమర్శలు ఆగడంలేదు. వ్యాఖ్యలు చూస్తే గుజరాత్, హిమాచల్ ఎన్నికల తర్వాత ఏపీలో పొత్తుపై భాజాపా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు సమయం పాటిస్తున్నా ఎమ్మెల్సీ సోము వీర్రాజు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా సోము వీర్రాజుకు మరో నేత మాధవ్ తోడయ్యారు. సోము వీర్రాజు వ్యూహాత్మకంగానే చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నట్లు అర్థమవుతోంది. పోలవరం, అమరావతి నిర్మాణాలు దైవ నిర్ణయం మీద ఆధాపడుతాయనే చంద్రబాబు మాటలపై మాధవ్ తీవ్రంగా మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మానం విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పోలవరం, రాజధాని నిర్మాణం దేవుడిపై భారం అంటూ సిఎం బాబు వ్యాఖ్యానించడంపై భాజాపా ఎమ్మెల్సీ మాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. పోలవరం, రాజధాని నిర్మానంలో రాష్ట్రం ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. పోలవరానికి సంబంధించిన ఎటువంటి బిల్లులు పెండింగ్‌లో లేదని వెల్లడించారు.
సంక్రాంతికి ప్రజలుకు చంద్రన్న కానుకల్లో క్వాలిటీ లేదని…పథకం పక్కదారిపడుతోందని ఆరోపించారు. విజయవాడంలో హిందూ దేవాలయాలను కూలగొట్టడంతో హిందువుల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ఎప్పుడూ లేనంతగా భాజాపా ఎమ్మెల్సీలు బాబును టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే త్వరలోనే వీరి బంధానికి బీటలు రావడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.