Tuesday, May 6, 2025
- Advertisement -

నగరిలో రోజాను ఏకగ్రీవంగా గెలిపించేస్తారా…..: చంద్రబాబు ఆగ్రహం

- Advertisement -

వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు అందరికంటే కూడా జగన్ ఓడిపోతే చూడాలన్న ఆశ, ఆత్రం చంద్రబాబుకు మామూలుగా ఉండదు. పులివెందులలో వైఎస్‌లకు కనీసం పోటీ ఇవ్వాలన్న ఆశతోనే చంద్రబాబు 2004 ఎన్నికలకు ముందు నుంచే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసమే కాంగ్రెస్‌తో కుమ్మక్కు కూడా అయ్యాడు. అయితే ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్‌ల మెజారిటీ పెరగడమే కానీ కనీసం తగ్గించలేకపోయాడు చంద్రబాబు. ఇక వైఎస్ జగన్ తర్వాత వైకాపాలో ఉన్న నాయకుల్లో ఇంకొకరిని కూడా ఓడించాలని అదే స్థాయి పట్టుదలతో ఉంటాడు చంద్రబాబు. ఆ నాయకురాలే రోజా.

అసెంబ్లీలో కూడా రోజాను ఎదుర్కోలేకపోయిన చంద్రబాబు అండ్ కో కుట్రలు పన్ని మరీ రోజాను అసెంబ్లీ నుంచి గెంటేశారు. ఇక 2019 ఎన్నికల్లో మాత్రం రోజాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వకూడదని చంద్రబాబుతో సహా టిడిపి నాయకులు అందరూ కంకణం కట్టుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే 2014 ఎన్నికల్లో రోజాను ఢీ కొని ఓడిపోయిన సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు హఠాన్మరణం నేపథ్యంలో ఇప్పుడిక కనీసం రోజాకు పోటీనిచ్చే నాయకుడు కూడా చంద్రబాబుకు దొరకని పరిస్థితి. గాలి ముద్దుకృష్ణమనాయుడి కుటుంబం నుంచీ ఆయన కొడుకు, కూతురు 2019 నగరి టిక్కెట్ ఆశిస్తున్నారు కానీ వాళ్ళకు రోజాను ఎదుర్కునే సీన్ లేదని చంద్రబాబుకు గట్టి నమ్మకం. మరోవైపు నారా లోకేష్‌ కూడా ఈ నియోజకవర్గ వ్యవహారాల్లో తలదూర్చుతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంతో విసిగిపోయిన చంద్రబాబు…….2019లో నగరి నియోజకవర్గాన్ని ఏకగ్రీవం చేసి రోజాకు అప్పగిస్తారా? స్థాయి లేకుండా సీటు కోసం మీరు గొడవలు పడితే క్యాడర్ నిరుత్సాహపడదా? టిడిపికి డిపాజిట్స్ అయినా దక్కనివ్వరా? ఎప్పుడు ఏం చేయాలో? ఎవరికి టికెట్ ఇవ్వాలో నాకు తెలుసు. అంతా నాకు వదిలెయ్యండి అని టిడిపి నగరి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. మొత్తంగా చూస్తే 2019లో నగరిలో రోజాను ఎలా అయినా ఓడించాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబుకు కనీసం రోజాను ఎదుర్కునే స్థాయి అభ్యర్థి కూడా దొరక్కపోవడం మాత్రం వైకాపా శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -