పార్టీలో ఎంతటి వారు తప్పు చేసినా క్షమించను , పార్టీ నిర్ణయాలకు ఎవరైన కట్టుబడాల్సిందేనని వివిధ పార్టీ సమావేశాల్లో నిత్యం బాబు నోటినుంచి వచ్చే మాటలు. అయితే అందర్నీ భయపెట్టి తన కను సన్నల్లో ఉంచుకొనే బాబు జేసీ బ్రదర్స్ విషయంలో మాత్రం ఏమాంట్లాడలేని పరిస్థితి. పైగా బాబు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నా ఎదురు మాట్లాడలేని పరిస్థితి. తాజాగా జేసీ బ్రదర్స్ దెబ్బకు బాబు దిగొచ్చారు.
టీడీపీలో అందరి నాయకులది ఒక దారి అయితే జేసీ బ్రద్స్‌ది మాత్రం మరో దారి. పార్టీ అధినేత బాబు ఆదేశాలనుకూడా లెక్కచేకుండా ముందుకెల్తుంటారు. ఆధిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎంతకైనా వెనుకాడరు. గత కొంత కాలంగా రాజకీయాలనుంచి పక్కకు తప్పొకొంటామని తమ వారులసుకు టికెట్లు ఇవ్వాలని బాబుపై ఒత్తిడి తెచ్చారు. ఈసారి ఎన్నికలు టఫ్‌గా ఉండనుండటంతో సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని బాబు జేసీ సోదరులకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే పట్టు విడవకుండా జేసీ సోదరులు తమ వారసులకు టికెట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి కూర్చునున్నారు.
అనంతపురం జిల్లానుంచి పోటీ చేసె అభ్యర్తుల విషయంలో బాబు జిల్లా నేతలతో చర్చించారు. హిందూపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో అభ్యర్తులను ఖరారు చేశారు. రాప్తాడు నుంచి మంత్రి పరిటాల సునీత, ధర్మవరం నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ, హిందూపురం నుంచి బాలకృష్ణ, పెనుకొండ నుంచి బి.కె.పార్థసారథిలకు మరోసారి అవకాశం కల్పించారు. అనంతపురం నుంచి ప్రభాకర్ చౌదరి, రాయదుర్గం నుంచి కాలవ శ్రీనివాసులు పోటీ చేయనున్నారు .అనంతపురం జిల్లా రాజకీయాలపై తనదైన ముద్రవేసిన జేసీ సోదరులు తమ వారసులకు సీట్లు కేటాయించాలని ముందు నుంచి పట్టుబడుతున్నారు. తమ స్థానాల్లో వారికి టిక్కెట్లు ఇవ్వాలన్న జేసీ సోదరుల డిమాండ్లను చంద్రబాబు అంగీకరించారు. తమ కుమారులను గెలిపించుకొనే బాధ్య త మాది అని బాబుకు చెప్పడంతో మైండ్ సెట్ మార్చుకున్న చంద్రబాబు తాడిపత్రి స్థానాన్ని ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి, అనంతపురం ఎంపీ స్థానాన్ని దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి కేటాయించారు.