వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీతో దోస్తీ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. బీజేపీతో కలుస్తానంటూ జగన్ చెప్పడం ఇదే మొదటిసారి కాదని ఎద్దేవా చేశారు. ఒక మాటపై నిలబడే వ్యక్తిత్వం జగన్ ది కాదని విమర్శించారు.
ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పిన జగన్… ఇంతవరకు ఎందుకు రాజీనామాలు చేయించలేదని ప్రశ్నించారు. కేసులను ఎత్తి వేయించుకోవడానికి, అక్రమాస్తులను కాపాడుకోవడానికే జగన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమాస్తుల్లో చిక్కుకున్నవారి ఆస్తులను స్వాధీనం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలని ఆయన అన్నారు.
వారంరోజుల క్రితం జాతీయ ఛానల్‌కు జగన్ ఇచ్చిన ఇంటర్యూలో ప్రత్యేకహోదాపై మాట్లాడారు. మాకు ప్రత్యేకహోదా తప్ప మరొకటి ముఖ్యం కాదన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీకీ ఇవ్వాల్సిన ప్రత్యేకహోదా భాజాపా ఇస్తే వారితో కలసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామన్న సంగతి తెలిసిందే.