నంద్యాల ఉప ఎన్నిక భయం చంద్రబాబుకు ఎంత పట్టుకుందొ అర్థమవుతోంది. ఉపఎన్నిక ఖరారు అయ్యాకా.. చంద్రబాబు నాయుడు నంద్యాల్లో రెండు సార్లు టూరేశాడు.రెండుసార్లూ సిఎం చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన మాటలు జాతీయ స్ధాయిలో వివాదాస్పదమయ్యాయి. రాష్ట్రంలోని జాతి మీడియా పెద్దగా ఫోకస్ చేయకపోయినా జాతీయ మీడియా మాత్రం రెండు సార్లు చంద్రబాబు మాట్లాడిన మాటలను ఉతికి ఆరేసింది. ఒకసారి పుత్రరత్నం, మంత్రి నారా లోకేష్ కూడా పర్యటించేసారులేండి అది వేరే సంగతి.
ఇప్పుడు ముచ్చటగా మూడో సారి నంద్యాల పర్యటన చేయనున్నారు.మున్సిపాలిటీకి పోటీ చేసే వాళ్లు కూడా ఓట్లను అడగడంలో బాబుగారి కన్నా డిప్లొమాటిక్ గా మాట్లాడతారు… అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా ప్రచారానికి మొత్తం పదిహేనురోజుల సమయం ఉంది. ఈ లోపు బాబు కనీసం రెండు సార్లు పర్యటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.19 నుంచి 21 వరకూ అక్కడే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ఏకంగా రెండువారాల పాటు నంద్యాలలోనే క్యాంపు వేస్తానని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి పరిస్ధితిల్లో చంద్రబాబు కనీసం మూడు రోజులైనా క్యాంపు వేయకపోతారా అని స్ధానిక టిడిపి నేతలు ఎదురుచూస్తున్నారు. మూడు రోజుల్లో ఓ భారీ బహిరంగ సభతో పాటు రోడ్డుషోలు కూడా చేయాలని ప్లాన్ వేస్తున్నారట.