Monday, May 5, 2025
- Advertisement -

దేవుడా…… బాబు అవిశ్వాసం డ్రామా బట్టబయలు…… ఎన్నికల ఏడాదిలో కూడా ఇంత మోసమా?

- Advertisement -

పచ్చ మీడియా ఎంత మేనేజ్ చేసినా కూడా అసలు విషయం గుట్టురట్టయింది. నాలుగేళ్ళుగా హోదా కోసం పోరాడుతున్న జగన్‌ని పోరాటాన్ని హైజాక్ చేసి మరీ హోదా క్రెడిట్‌ని కొట్టేయాలన్న దుగ్థతో బాబు ఆడిన డ్రామాలన్నీ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి. అవిశ్వాస తీర్మానం పెట్టామని, మోడీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నంత స్థాయిలోనూ….దేశం మొత్తం మీద ఉన్న పార్టీలన్నీ తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తున్నాయన్నంత స్థాయిలో బాబు అండ్ పచ్చ మీడియా ఆడిన డ్రామాలన్నీ వీడియో సాక్ష్యాలతో సహా బట్టబయలయ్యాయి. వెల్‌లోకి వెళ్ళొద్దు…..అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలా చూడండి అని చంద్రబాబు ప్రతిరోజూ ఎంపిలకు చెప్తున్నాడంటూ పచ్చ మీడియా ఎంత బుకాయించినా అసలు అవిశ్వాస తీర్మానం చర్చకే రాకుండా టిడిపి ఎంపిలు ఆడిన డ్రామాలను నేషనల్ మీడియా పూర్తిగా బయటపెట్టేసింది.

అవిశ్వాస తీర్మానం ఇచ్చేదీ టిడిపి ఎంపీలే. ఆ తర్వాత ఆ తీర్మానం చర్చకు రాకుండా సభలో గందరగోళం సృష్టించేది కూడా టిడిపి ఎంపిలే. అదీ చంద్రబాబు అసలు రంగు. చంద్రబాబు మాటలు ఒకలా ఉంటాయి……చేతలు మాత్రం పూర్తి రివర్స్‌‌లో ఉంటాయి. ఇప్పుడు కూడా అదే చేశాడు. అసలు ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఆ తీర్మానం చర్చకు రావడం చంద్రబాబుకు ఇష్టమే లేదు. కానీ అవిశ్వాస తీర్మానం అన్న జగన్‌కి ప్రజల్లో భారీ స్పందన కనిపంచడంతో వెంటనే చంద్రబాబు మేల్కొన్నాడు. జగన్ అవిశ్వాస తీర్మానం పెడుతుంటే……అవిశ్వాసం వళ్ళ ఏంటి ఉపయోగం? మోడీ ప్రభుత్వం పడిపోతుందా అని ఎద్దేవా చేసిన చంద్రబాబు…….అవిశ్వాసం అన్న జగన్‌కి వచ్చిన ప్రజా స్పందన చూసి 24గంటల్లో ప్లేట్ ఫిరాయించాడు. జగన్ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తానన్నాడు. ఆ తర్వాత తానే అవిశ్వాస తీర్మానం పెడతానన్నాడు. జగన్‌ది దొంగ అవిశ్వాస తీర్మానం అన్నాడు. కానీ జగన్‌ అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు ఎందుకు మద్దతివ్వలేదో ఇఫ్పుుడ నేషనల్ మీడియా సాక్ష్యాలతో బయటపెట్టింది. అవిశ్వాస తీర్మానం అని చెప్పి నోటీసులు ఇస్తున్న టిడిపి ఎంపిలే ఆ తర్వాత ఆ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ఉండేలా స్పీకర్‌ని ప్రభావితం చేస్తున్న తీరును వీడియో సాక్ష్యాలతో సహా టైమ్స్ నౌ ఛానల్ ఎండగట్టింది. మొత్తంగా చంద్రబాబు మోసపూరిత తీరును బయటపెట్టింది. ఆంధ్రులపై మోడీకి పగ ఎందుకు అని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు అవిశ్వాస డ్రామాల గురించి తెలుసుకున్న తర్వాత మాత్రం……….. ఆంధ్రప్రదేశ్ జనాలపై చంద్రబాబుకు పగ ఎందుకు? అని ఆంధ్రప్రదేశ్ జనాలు అనుకుంటున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ లాంటి అన్ని విషయాలూ ఎపికి రాకుండా పోతూ ఉండడంలో చంద్రబాబు అక్రమాల స్వార్థ వ్యవహారాలే కారణమన్నది విశ్లేషకుల మాట. ఇక తాను ఇచ్చిన రుణమాఫీ, నిరుద్యోగ భృతి హామీలను అమలు చేయకుండా ప్రజలను హింసిస్తున్నాడు. అందుకే ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై చంద్రబాబుకు పగ ఎందుకు అని ఇప్పుడు సోషల్ మీడియా జనాలు కూడా ప్రశ్నిస్తున్నారు. విభజన నాటి నుంచీ కూడా ప్రతి సందర్భంలోనూ సీమాంధ్ర ప్రజలను చంద్రబాబు ఎందుకు వంచిస్తున్నాడు? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -