వైసీపీ అధినేత జగన్ పవన్‌పై చేసిన వ్యాఖ్యలపై పవన్ కూడా అంతే రీతిలో స్పందించారు. ఇరు పార్టీల అధినేతలు వ్యక్తిగతంగా చేసుకున్న విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. జగన్‌ను సున్నితంగా హెచ్చరించారు.
పార్టీ అధినేత కాకుండా ఇతర నాయకులు మాట్లాడింటే ఇబ్బందిలేదని కాని అధినేతే మాట్లాడటం మంచిది కాదన్నారు. జగన్ నోరు జారారని జాగ్రత్తగా ఉండాలని సున్నితంగా హెచ్చరించారు. ఆయనకు సరైన అవగాహన లేకుండా మాట్లాడారన్నారు.
పవన్ కళ్యాణ్ పెళ్లి విషయమై సరైన అవగాహన లేకుండా జగన్ మాట్లాడారని నాగబాబు చెప్పారు. ఎవరినో పెళ్లి చేసుకుంటానని వదిలేయడం పవన్ చేయలేదన్నారు. పవన్‌ను విమర్శించడానికి ఓ పాయంట్ కావాలని అదిలేకనే వైవాహిక సంబంధం గురించి మాట్లాడుతున్నారన్నారు
జగన్ అభద్రతా భావానికి లోనయ్యారని అందుకే జగన్ అలా మాట్లాడి ఉంటారని నాగబాబు అభిప్రాయపడ్డారు. టీడీపీ లేదా వైసీపీ పవన్‌ను చాలా తక్కువగా అంచనా వేసి ఉండవచ్చునని, పవన్ వల్ల తమకు లబ్ధి చేకూరుతుందని ఇరు పార్టీలు భావించి ఉంటారని అన్నారు. రాష్ట్రంలో పవన్ బలంగా తయారవుతున్నారని అది తట్టుకోలేక బలహీనరపిచేందుకే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు.