Sunday, May 4, 2025
- Advertisement -

ఆ ప‌ని చేయ‌క‌పోతె చంద్ర‌బాబు గ్రాఫ్ ప‌డిపోతుంది..ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్

- Advertisement -

చంద్ర‌బాబు నాయుడుపై నిత్యం విరుచుకుప‌డే ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మొద‌టిసారిగా సానుకూలంగా మాట్లాడారు. కేంద్రంపై అశిశ్వాసంతో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు వేడెక్కాయి. టీడీపీ సొంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టడం ఏపీ రాజకీయాల్లో మంచి పరిణామమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ టీడీపీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తాయని చెప్పారు. అవిశ్వాసం చంద్రబాబుకు పెద్ద పరీక్ష అని… ఆయన పట్టుదలగా వ్యవహరిస్తే అవిశ్వాసంపై చర్చ సాధ్యమేనని అన్నారు. పార్లమెంటులో అవిశ్వాసంపై చర్చ జరగకపోతే… చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుందని చెప్పారు.

అవిశ్వాసాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా… ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పారు. వాస్తవానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వల్లే టీడీపీ అవిశ్వాసం పెట్టిందని తెలిపారు. బీజేపీతో పవన్ కుమ్మక్కయ్యారనేది అవాస్తవమని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -