Wednesday, May 7, 2025
- Advertisement -

ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మోత్కుప‌ల్లి..

- Advertisement -

తెలంగాణా టీడీపీ బ‌హిస్క్రుత‌నేత మోత్కుప‌ల్లి న‌ర‌శింహులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అలేరునుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్ర‌క‌టించారు. డీపీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తనకు జ‌న‌సేన గానీ టీఆర్ఎస్ పార్టీలో చేరుతానే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఆ వ్యాఖ్య‌ల‌పై మ‌రోసారి క్లారిటీ ఇచ్చారు. టీడీపీనుంచి బ‌హిస్క‌ర‌ణ‌కు గుర‌యిన త‌ర్వాత తనకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదని అన్నారు. కేసీఆర్ చాలా మందిని దగ్గరకు తీశారని, తాను దళితుడిని కావడం వల్లేనేమో ఆయన తనను దూరంపెట్టి ఉంటారని అభిప్రాయపడ్డారు.

గతంలో తాను ఆలేరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తనను ప్రజలు గెలిపించారని గుర్తుచేసుకున్నారు. ఆలేరు ప్రజలు మరోసారి తనను దీవిస్తామని చెబుతున్నారని, అందుకే, త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఈ నెల 27న ఆలేరులో ‘మోత్కుపల్లి శంఖారావం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు.

కాంగ్రెస్-టీడీపీ పొత్తు కుదుర్చుకోవడంపై మోత్కుపల్లి తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సిద్ధాంతాలకు తూట్లు పొడిచిన చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీతో జతకడుతున్నారని, ఆ జతకట్టే దశలో పదో ఇరవయ్యో సీట్లు అడుక్కునే పరిస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -