Tuesday, May 6, 2025
- Advertisement -

సేఫ్ జోన్ చూసుకుంటున్న టీడీపీ సీనియ‌ర్ నేతలు

- Advertisement -

దేశం అంతా చ‌ల్ల‌గా ఉంటే ఏపీ లో మాత్రం రాజ‌కీయాలు వింట‌ర్ సీజ‌న్‌లో కూడా హీటు పుట్టిస్తున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌రానికి రాజ‌కీయ పార్టీలు సై అంటున్నాయి. అయితే అన్ని పార్టీల‌ల్లో అస‌మ్మ‌తి.. పార్టీ అధినేత‌ల‌కు ద‌డ‌ పుట్టిస్తోంది. టికెట్ రాని జంపింగ్ జిలానీలు వేరే పార్టీలోకి జంప్ చేసేందుకు గోడ‌మీద పిల్లులా రెడీగా ఉన్నారు.

అన్ని పార్టీల సంగతి ఏమోగాని ఫిరాయింపులను ప్రోత్సాయించిన టీడీపీ అధినేత‌కు మాత్రం ఇప్పుడు అసమ్మతి సెగ ముచ్చేమటలను పట్టిస్తుంది. జనవరిలోనే పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని చెప్పేశారు బాబు. దీంతో పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. తమకు సీట్లు వస్తాయో.. రావోననే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచే అన్ని పరిణామాలను బేరీజు వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీలో టికెట్ రాని వాళ్లంతా సేఫ్ జోన్ చూసుకుంటున్నారు.

అసెంబ్లీ సీట్లు పెరుగుతాయ‌ని ఆశ‌ప‌డిన బాబు ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు. కాని 2026 వ‌ర‌కు సీట్లు పెర‌గ‌ని కేంద్రం చెప్ప‌డంతో ఫిరాయింపుల‌కు టికెట్లు రాని ప‌రిస్థితి ఉంది. ఈసారి యువతకు పెద్ద పీట వేస్తామని చంద్రబాబు ప్రకటించడం కూడా సీనియర్లకు ఇబ్బంది కలిగిస్తున్న అంశం. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒంటికాలిపై లేస్తున్న బిజెపి ఎమ్ఎల్ఏ మాణిక్యలా రావు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

టీడీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్న నేప‌ధ్యంలో పార్టీలోని కొందరు నేతలు పక్కదారి చూస్తున్నారని చెప్పుకొచ్చారు. త్వ‌ర‌లో ప‌లువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీని వీడ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. టీడీపీలో దాదాపు 15 నుండి 25 మంది సిట్టింగ్ నేత‌లు పార్టీ మారే అవ‌కాశం ఉంద‌ని హాట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -