ఏపీలో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే కొందరు నేతలు సీట్లు ఇచ్చే పార్టీలను వెతడకడం మొదలుపెట్టారు. సీట్లు దొరకని నేతలు పార్టీలు మారేందకు రంగం సిద్దం చేసుకున్నారు. వంగవీటి రాధా ఇటీవలే వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ ఎమ్మెల్యే తాను బరిలో దిగడం లేదని ప్రకటించారు. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గత ఎన్నికలలో విజయవాడ పశ్చిమ నుంచి వైసీపీ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచారు. తరువాత ఆయన పార్టీ మారి అధికార టీడీపీలో చేరారు.
తాజాగా ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం లేదని ప్రకటించి షాకిచ్చారు. తనకు బదులుగా తన కూతురు షబానా పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. దీనిలో భాగంగానే కూతురు షబానాతో కలిసి ఆయన మంగళవారం సీఎం చంద్రబాబుని కలిసి తన కూతురు పోటీ చేయడంపై క్లారిటీ తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కూడా జలీల్ ఖాన్ కూతురు పోటీపై సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజలలో తనపై వ్యతిరేకత ఉన్న కారణంగానే జలీల్ ఖాన్ తన కూతురిని రంగంలోకి దింపుతున్నట్లు వినికిడి.మంత్రి పదవి ఆశించి టీడీపీలో చేరిన ఆయనకు నిరాశే ఎదురైంది. ముస్లిం కమ్యూనిటీ ఛైర్మన్ పదవి ఇస్తారని ఆశించినప్పటి, ఇక్కడ కూడా భంగ పాటే ఎదురైంది. ఇక ఆయన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు బికాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాలలో భాగానే ఫేమస్ అయ్యారు.