Sunday, May 4, 2025
- Advertisement -

చంద్రబాబు ఈ ఆలోచనలే కొంప ముంచాయా..?

- Advertisement -

అధికారంలోకి ఎ పార్టీ వచ్చినా చంద్రబాబు ప్రతిపక్షంలో మారట్లేదు అంటే అయన ఎన్ని సంవత్సరాలనుంచి అధికారంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.. నలభై సంవత్సరాల రాజకీయ పరిజ్ఞానం, మూడు సార్లు  సీఎం గా చేసిన అనుభం కలిసి చంద్రబాబు ఇప్పుడు దేశంలోనే సీనియర్ నాయకుడిగా ఉన్నారు.. అయితే మొన్నటి ఎలక్షన్స్ లో అయన ఓటమి తో పాటు బోలెడంత అపకీర్తిని మూటకట్టుకున్నాడు.. గతంలో ఎన్నడూ లేనంతగా చెడ్డ పేరు ప్రజలలో చంద్రబాబు కి ఉంది అంటే ఏం కోల్పోయారో ఇప్పటికే టీడీపీ కి అర్థమై ఉంటుంది..

చంద్రబాబు ఈ దుస్థితి కి ముఖ్యకారణం అయన అప్పుడెప్పుడో రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు అవలంభిస్తున్న విధానాలే..  ఎన్టీఆర్ ఉదంతం లో రామోజీ రావు ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్లే చేసిన మాస్టర్ గేమ్ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు.. మసి పూసి మారేడు కాయ చేయడంలో చంద్రబాబు ను మించిన వారు లేరని చెప్పాలి.. అయితే ఎన్టీఆర్ పై వేసిన ప్లాన్స్, పథకాలు ఆ తర్వాత అదే రామోజీ రావు సహాయంలో వైఎస్సార్ పై సంధించి కొంత సక్సెస్ అయ్యే ప్రయత్నం చేశారు.. కానీ చంద్రబాబు ను మాత్రం ఎక్కువ సేపు నిలదొక్కుకోనీకుండా మాత్రం వైఎస్సార్ చేయగలిగారు.. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చి వైఎస్సార్ రికార్డు సృష్టించారు..

ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అందరికి తెలిసిందే.. లైన్ లోకి జగన్ వచ్చాడు.. చంద్రబాబు అయితే మారలేదు.. అంతేకాదు చంద్రబాబు, చంద్రబాబు చేసే విమర్శలు, సంధించే అస్త్రాలు కూడా ఏమాత్రం మారలేదు.. 40ఏళ్ల తర్వాత కూడా ఆనాడు తాను నేర్చుకున్న అస్త్రాలను ఉపయోగించి అందలం దక్కించుకోవాలని ఆశిస్తుంటారు వైఎస్సార్ ఇలాకాలో ఇది కొంత పనిచేసింది. కాబట్టి దానినే వైఎస్ జగన్ మీద కూడా ప్రయోగించాలని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది.  అయితే అది బెడిసి కొడుతుంది.. ఆ విషయం చంద్రబాబు కు అర్థమయ్యేటప్పటికీ పుణ్యకాలం కాస్త గడిచిపోయేటట్లు ఉంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -