బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఇటీవల ప్రదాన మంత్రి నరేంద్ర మోడి తెలంగాణ కు వచ్చారు. హైదరబాద్ లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజల్లో మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. ప్రధాని మోడి రాకతో తెలంగాణ బీజేపీ నేతల్లో కూడా కొత్త ఉత్సాహం కనిపించింది. ప్రస్తుతం రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా బీజేపీ పై ప్రజల్లో సానుకూలత ఏర్పడినట్లే కనిపిస్తోంది. ఈ సానుకూలతను మరింత బలపరిచేందుకు బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు. ప్రస్తుతం రాష్టంలో బీజేపీ హవా మెల్లమెల్లగా పెరుగుతూ ఉండడం టిఆర్‌ఎస్ కు మింగుడుపడడం లేదనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో దేశ ప్రధాని రాష్ట్రనికి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవప్రదంగా ప్రోటోకాల్ పాటించాల్సిఉంటుంది. కానీ సిఎం కేసిఆర్ ప్రధాని మోడి రాకను ఏమాత్రం స్వాగతించలేదని, కనీసం స్వాగతం పలికేందుకు కూడా ఆసక్తి చూపలేదనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో జోరుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధాని మోడి హైదరబాద్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు, కానీ సిఎం కేసిఆర్ రాకపోవడమే ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ విషయం అలా ఉంచితే ప్రధాని మోడి ఆంద్రప్రదేశ్ వెళ్లినప్పుడు అక్కడ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానికి ఘన స్వాగతం పలికారు. కానీ తెలంగాణలో మాత్రం సిఎం కేసిఆర్ అలాంటి ప్రోటోకాల్ పాటించకపోవడంతో కొంత మేర విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
అయితే సిఎం కేసిఆర్ ప్రధానికి స్వాగతం పలకకపోవడానికి కారణం కూడా లేకపోలేదు.. ప్రధాని మోడి ప్రత్యేకంగా తెలంగాణ సందర్శించడానికి కాకుండా బీజేపీ పార్టీ సమావేశాల తరుపున వచ్చారు..అంటే అది పూర్తిగా రాజకీయ కార్యక్రమం కావడం వల్ల ప్రధాని రాకను సిఎం కేసిఆర్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం టిఆర్‌ఎస్ కు బలమైన ప్రత్యర్థి పార్టీగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్ పార్టీపైన, అలాగే ఆ పార్టీ నేతలపైన విమర్శనస్త్రాలు సంధించే అవకాశం ఉంది. దాంతో వీటన్నిటిని బేరుజు వేసుకొనే సిఎం కేసిఆర్.. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు రాలేదని ఇన్ సైడ్ టాక్. ఏది ఏమైనప్పటికి ప్రధాని రాక విషయంలో సిఎం కేసిఆర్ కాస్త హుందాగా వ్యవహరించి స్వాగతం పలికిఉంటే బాగుండని, అలా వ్యవహరించక పోవడం కేసిఆర్ చేసింది తప్పేననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.