Thursday, April 25, 2024
- Advertisement -

డ్ర‌గ్స్ మాఫియాకు పులుముకున్న రాజ‌కీయ రంగు

- Advertisement -

హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపుతున్న డ్ర‌గ్స్ మాఫియాకు రాజ‌కీయ రంగు పులుముకుంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ట్రెండింగ్ వార్తగా నిలిచిన డ్రగ్స్ రాకెట్ పై ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్నటిదాకా ఈ వ్యవహారంపై రాజకీయ నేతలు పెద్దగా మాట్లాడిన దాఖలా లేదు.
టాలీవుడ్ ను కుదిపేస్తున్న ఈ డ్రగ్స్ రాకెట్ తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో అటు అధికార పార్టీ నేతలు గానీ ఇటు విపక్షాలకు చెందిన నేతలు గానీ దీనిపై స్పందించేందుకు వెనుకాడారన్న వాదన కూడా లేకపోలేదు. అయితే ఎలాంటి రాజకీయ ప్రకటనలు – ప్రకంపనలు లేకుండానే సాగుతున్న డ్రగ్స్ వ్యవహారంలో ఎట్టకేలకు రాజకీయ ప్రకంపనలు రేగాయి.
డ్రగ్స్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్‌ఎస్‌ వారసుడి స్నేహితులకు ఈ వ్యవహరంతో సంబంధ ఉందని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణలో పెద్ద డ్రగ్స్‌ స్కామ్‌ జరిగింది. ఇందులో టీఆర్‌ఎస్‌ వారసుడి మిత్రులు ఉన్నట్టుగా కనబడుతోంది. వీరిని విచారిస్తారో, కాపాడతారో చూడాలి’ అంటూ దిగ్విజయ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.
డిగ్గీ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ కూడా దిమ్మతిరిగే సమాధానంతో రీ ట్వీట్ కొట్టారు. మీరు పూర్తిగా విచక్షణ కోల్పోయారు. గౌరవంగా రిటైర్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. మీ వయసుకు తగ్గట్టుగా నడుచుకోండి. తెలంగాణ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయడం నేర్చుకున్నందుకు సంతోషమ’ని కేటీఆర్ ఆ ట్వీట్ తో పేర్కొన్నారు. ఈ ట్విట్ట‌ర్ రాజ‌కీయం ఎతంవ‌ర‌కు వెల్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -