Friday, April 19, 2024
- Advertisement -

ఇక పీఠాన్ని అధిస్థించడమే తరువాయి ..!

- Advertisement -

దేశంలో ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఈ సారి రాష్ట్రపతి అభ్యర్థిగా సామాజిక వర్గ మాహిళ ద్రౌపది ముర్ము ను ఎన్డీయే కూటమి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రణాళిక బద్దంగా ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా బిజేపి ప్రకటించి గ్రాండ్ గా సక్సస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఆమెకు విపక్షాల నుంచి కూడా భారీగా మద్దతు పెరుగుతోంది. దాంతో ఆమెకు పోటీ లేకుండా పోయింది.

కేవలం జాతీయంగానే కాకుండా ప్రాంతీయ పార్టీల నుంచి కూడా ఆమెకు మద్దతు గట్టిగానే లభిస్తోంది. మద్దత్తు కోసం దేశంలో ఆమె విస్తృతంగా పర్యటిస్తుండడంతో ప్రాంతీయ పార్టీలు దగ్గరయ్యాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, అన్నాడీఎంకే, శివసేన, జె ఏం ఏం, అకాలీదళ్, బిఎస్పీ, నవాజ్ వాదీ పార్టీ, భారతీయ సమాజ్ వాదీ పార్టీ, వంటి ప్రాంతీయ పార్టీలు భారీగా మద్దతు పలికాయి. దీంతో రాష్ట్రపతి కావడానికి.. కావలసిన ఓటు శాతంలో ద్రౌపది ముర్ము కు 60 శాతం కంటే ఎక్కువే మద్దతు లభించింది. దీంతో ఆమె గెలుపు లాంఛనమే అయింది.

ముఖ్యంగా ఆదివాసీ మహిళా కావడంతో అన్నీ వైపులా నుంచి ఆమెకు మద్దతు లభిస్తూనే ఉంది. దీంతో దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి పీఠంన్ని ఒక గిరిజన మహిళా అధిస్థించడం దాదాపు ఖాయం అయినట్లే. మన దేశంలో మొదటి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభ పాటిల్ నిలువగా.. ఆ తరువాత రెండవ మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పేరు నిలువనుంది. అంతే కాకుండా మొట్ట మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పేరు చరిత్రలో నిలిచిపోనుంది..

ఇవి కూడా చదవండి

వాలెంటిర్లు దూరం..షాక్ లో జగన్ !

సోనియా చర్చలు.. రాహుల్ యాత్రలు !

హీటెక్కిస్తున్నా సర్వే ఫలితాలు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -