Monday, May 5, 2025
- Advertisement -

ముంద‌స్తుకు మోదీ రెడీనా….? డిస్సెంబ‌ర్‌లో లోక్ స‌భ ర‌ద్దు..?

- Advertisement -

తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీలు అభ్య‌ర్తుల ఎంపిక‌, ఎన్నిక‌ల ప్ర‌చారంలో మునిగితేలుతున్నాయి. ఇక ఏపీలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంది కదా అని పార్టీలు కూల్‌గా త‌మ ప‌ని తాము చేసుకుంటు పోతున్నారు. అయితే తాజాగా ఏపీకి కూడా కేంద్రం షాకిచ్చేలా ఉంది. తెలంగాణతో పాటు ఏపీకి కూడా ఒకేసారి ఎన్నికలు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

మొద‌టి నుంచి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్ర‌భుత్వం ముంద‌స్తు ఎన్నిక‌ల‌వైపే మొగ్గు చూపె అవ‌కాశాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. మోదీ ప్ర‌భుత్వం క్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో ప్రధాని మోదీ లోక్‌సభను రద్దు చేసే అవకాశాలు ఉన్నట్టు అధికారపార్టీ వర్గాల‌నుంచి వ‌స్తున్న స‌మాచారం.

ఒకవేళ అదే జరిగితే మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జనవరిలోనే జరిగే అవకాశాలున్నాయి. ఈసీకి ఉన్న విచక్షణాధికారాలకు అనుసరించి ఏపీకి కూడా తెలంగాణతోపాటే ఎన్నికలు జరపవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా కేంద్రంలో ముందస్తు ఎన్నికలకు సంకేతాల‌ను సూచిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -