పవన్ తన ఆంధ్రా పర్యటనలో పలు విషయాలపై మాట్లాడారు. అయితే పవన్ మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే ఒక దానికి..మరొకటి పొంతనలేకుండా మాట్లాడటం పవన్ ఫ్యాన్స్‌కూడాఇష్టంలేదు. క్లారిటీ లేకుండా మాట్లాడటం ఇప్పుడు ఫ్యాన్స్ ను వేధిస్తోంది. అసలు విషయానికి వస్తే..
తాజాగా పవన్ కల్యాణ్ ఒంగోలులో ప్రసంగించారు. పెద్దగా కొత్త విషయాలు ఏం లేవుగానీ.. తనలోని సందిగ్ధతను మరో మారు బయటపెట్టారు. తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ ‘ఒక్కడినే బయల్దేరా అని, మార్పు ఎప్పుడైనా సరే ఒక్కడితోనే మొదలవుతుందని’ అన్నారు. మరో సారి ప్రత్యేకహోదా నేను ఒక్కడినే పోరాడితే ప్రత్యేక హోదా రాదు… అందరూ కలిస్తేనే సాధించుకోవచ్చు’ అని సెలవిచ్చారు. ఏమైనా పవన్ మాటలకి పొంతన ఉందా…?
ఆయన ఇలాంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనలను తెలిసి చేస్తున్నారా? లేదా అమాయకంగా తెలియక చేస్తున్నారా? ప్రజల్ని ఆయన వెర్రివాళ్ల కింద జమకడుతున్నారా? తనేం మాట్లాడినా సరే.. జనం ‘సీఎం సీఎం’ అంటూ కేరింతలు కొడతారే తప్ప.. వారికి బుర్రల్లేవులే.. తను మాట్లాడిన విషయాలను లోతుగా పరిశీలించే వాళ్లెవరూ ఉండర్లే అని అనుకున్నారా ఏమో తెలియదు.
పవన్ కల్యాణ్ అభిమానులకు కూడా ఆయన ప్రసంగాల పట్ల ఏవగింపు పుడుతోంది. ఇతరత్రా మోజులతో ఆయన వెంటపడుతున్న వాళ్లు తప్ప… అంశాల వారీగా నిర్దిష్టమైన నాయకుడిగా ఆయనను చూడదలచుకుంటున్న వారు.. ఆయన పోకడల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కింద ఉన్న పవన్ అభిమాని ఆవేదన వీడియో చూడండి.