సీఎం జగన్ కి సినీ ఇండస్ట్రీ కృతజ్ఞతలు.. ఎందుకో తెలుసా?

- Advertisement -

గత ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. కరోనా రక్కసికి ఎంతో మంది బలి అయ్యారు. ముఖ్యంగా కరోనా దాటికి సినీ ఇండస్ట్రీ కుదేలైంది. ఎంతో మంది సినీ పరిశ్రమపై ఆధారపడ్డవారు రోడ్డున పడ్డారు. ఆ సమయంలో సినీ ప్రముఖులు వారికోసం ముందుకు వచ్చి ఆదుకున్నారు. తాజాగా కరోనాతో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది.

సినిమా థియేటర్లకు సంబంధించి విద్యుత్‌ చార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్ చూపించిన ఔదార్యం పై పలువురు సినీ హీరోలు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున అక్కినేనితో పాటు పలువును సినీ ప్రముఖులు కృతజ్ఞతులు తెలిపారు. సినీ కళాకారులను ఆదుకున్న ముఖ్య మంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఆదుకున్నారని ప్రశంసించారు. సీఎం వైయ‌స్ జగన్‌ సాయంతో వేలాది కుటుంబాలకు ఊరట లభించింది అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

కన్నీరు పెట్టుకున్న లేడీ కమెడియన్!

BREAKING NEWS: రాధిక, శరత్ కుమార్ లకు ఏడాది జైలు శిక్ష

తిరుపతి ప్రచారానికి సీఎం జగన్ సిద్దం.. ఏర్పాట్లలో నేతలు బిజీ బిజీ!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -